ఎన్నికల సమయంలో తమతో ఎక్కువ పని చేయించుకున్నారని..కానీ తమకు ఇచ్చిన హామీలు మాత్రం తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడం లేదని కొంత కాలంగా తెలంగాణ వ్యాప్తంగా తహశీల్దార్ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం వర్క్ టూ రూల్ సమ్మె నోటీసు ఇచ్చారు తహశీల్దార్లు.

తాజాగా తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ తో రూల్ నోటీసు ఇచ్చిన తహశీల్దార్ లకు షాక్ ఇచ్చింది తెలంగాణా సర్కార్.  కాగా, నేడు ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ విధుల్లో ఉన్న 18 మంది తహశీల్దార్ లను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదిలా ఉంటే తమ సమస్యలు పరిష్కరించాలని..సమ్మె నోటీసు లో భాగంగా   భోజన విరామ సమయంలో కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసన చేపడతామనీ, డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఈ నెల 15 నుంచి సామూహికంగా సెలవులు పెడతామని నోటీసులో పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన తెలంగాణ సర్కార్ పురపాలక సంఘాల ఎన్నికలకు సమస్యలు కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కమిషనర్‌ విధుల్లో 18 మంది తహసీల్దార్లు ఉన్నారు. వారిని తప్పించి, వారి ఆయా స్థానాల్లో ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: