- ముఖ్యమంత్రి జగన్‌ మరో సంచలన నిర్ణయం
ఆకాశంలో చుక్కలు కనిపించకముందే మందు చుక్క కావాలనుకుంటే ఆరుగంటల లోపునే చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. సంచలనాల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా పేల్చిన మరో మందుబాంబు ఇది. ఇది అక్టోబర్‌ నుంచి అమలులోనికి రానున్నట్టు సమాచారం. ఈ నిర్ణయం మందుబాబులకు భారీ బాంబే కానుంది. 


ఈ నిర్ణయంతో ఎన్నికల హామీలలో ఒకటైన రాష్ట్రంలో దశలవారీ మధ్యపాన నిషేదం ద‌శ‌ల‌వారీ కీల‌క అడుగులుపడుతున్నట్టే. వేల కోట్లు ఆదాయ‌న్ని తెచ్చి పెట్టే మ‌ద్యం అమ్మ‌కాలపై నియంత్ర‌ణ‌. సాయంత్రం అయితే చాలు.. బార్లు ..వైన్ షాపుల ముందు కిక్కిరిసే మందుబాటులు ఆ అవ‌కాశం కోల్పోతున్నారు. సాయంత్రం ఆరు గంట‌లు దాటితే ఏపీలో మ‌ద్యం అమ్మ‌కాలు బంద్ చేసే ప్ర‌తిపాద‌న సిద్దం అయింది.

 అందులో భాగంగా ఇక నుండి ఏపీలో మ‌ద్యం విక్ర‌యాలు ప్ర‌స్తుతం ఉద‌యం 10 గంట‌ల నుండి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ఉండ‌గా..ఇక నుండి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కే ప‌రిమితం చేయ‌నున్నారు. అక్టోబ‌ర్ నుండి అమ‌ల్లోకి వ‌చ్చే కొత్త ఎక్సైజ్ పాల‌సీలో ఈ ప్ర‌తిపాద‌న తెర మీద‌కు వ‌చ్చింది. మందుప్రియులు అధికంగా రాత్రే మద్యం తాగు తారు.ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలావరకు అమ్మకాలు తగ్గుతాయనేది ప్రభుత్వం అంచన. 


మరింత సమాచారం తెలుసుకోండి: