దశాబ్దాలుగా ప్రజా పంపిణీలు చేస్తూ,  జీవనోపాధిగా చేసుకొని కుటుంభ పోషణ సాగిస్తున్న తమకు వృత్తి భద్రత  కల్పించాలని ఇచ్చాపురం నియోజకవర్గం రేషన్‌ డీలర్ల సంఘ ప్రతినిధులు  ప్రభుత్వాన్ని  కోరారు.  ఈ మేరకు కంచిలి తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ అధికారికి వినతిపత్రం అందచేశారు. రైలు నిలయం దగ్గర దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షిరాభిషేకం చేయించి, పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. 


సేవాదృక్పధంతో  కార్యక్రమాలు నిర్వహిస్తున్న డీలర్ల విషయంలో మానవతా దృక్పధం ప్రదర్శించి ఆదుకోవాలని వారంతా కోరారు. మరోవైపు కవిటి గ్రామంలో డీలర్లు ర్యాలీ నిర్వహించి తమ ఆవేదనను తెలియజేశారు. సోంపేట గ్రామంలో డీలర్ల సంఘం ప్రతినిధులు సానా షణ్ముఖరావు, తుమ్మల వీరాస్వామి , సానా మోహనరావు ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో పాటు నియోహకవర్గ వైకాపా సమన్వయకర్తకు కూడా  వినతిపత్రం అందజేశారు. 


మరో వైపు కవిటి గ్రమాలకు చెందిన డీలర్ల  సంఘం నాయకులు భాస్కరరావు, మోహనరావు, జ్ఞాన వెంకరరావు, శంకరరావు, వేణు రెవిన్యూ కార్యాలయంలో డీటీ ఆర్ . రమేష్ కు వినతిపత్రాలు అందజేశారు. తమ గోడును ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా వారు కోరారు. అనాధిగా రేషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ పైనే అధారపడి ఉన్నామని , ఈ వ్యవస్థను తొలగించడంతో వీధిన పడక తప్పదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: