దేశంలో కాంగ్రెస్ పార్టీ పరాజయం తరువాత ఆ పార్టీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. రెండేళ్ల క్రితం అధ్యక్షుడిగా పదివీబాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ, పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేశారు. అయితే, రాజీనామాను పార్టీ మొదట అంగీకరించలేదు.  


కానీ రాహుల్ మాత్రం పట్టు వదలలేదు.  ఎలాగైనా రాజీనామాను ఆమోదించాలని పట్టుబట్టారు.  చివరికి తన రాజీనామాకు సంబంధించిన విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రాహుల్ రాజీనామాను ఆమోదించాల్సి వచ్చింది.  


రాహుల్ తో పాటు ఇప్పుడు వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ అధ్యక్షులు రాజీనామాలు చేస్తున్నారు.  పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా కూడా రాజీనామా చేయడం విశేషం.  రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తరువాత తాత్కాలిక అధ్యక్షుడిగా వోరా ను నియమించారు.  


పార్టీకి రాజీనామా చేసినా... ఇప్పటికి రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా ఉన్నట్టు ద్వివేది.. చెప్పారు.  అదెలా అనుకుంటే దానికి ఓ లెక్క ఉందట.  రాహుల్ గాంధీ రాజీనామాను ఆమోదించినా.. టెక్నికల్ ఇంకా ఆమోదం కాలేదని అందుకే టెక్నికల్ గా రాహుల్ గాంధీనే జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: