గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పై ఉన్నవి,లేనివి కేసులు పెట్టడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చిన జిఎస్టి అదికారి బొల్లినేని శ్రీనివాస్ గాంధీ పై సిబిఐ అదికారులు దాడులు చేసి అవినీతి కేసులునమోదు చేయడం సంచలనంగా ఉంది. ఈడి శాఖలో ఉన్నప్పడు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు చేశారని కొంతమంది ఆరోపిస్తుంటారు. చంద్రబాబుకు సన్నిహితుడు అయిన ఈ అదికారి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కంపెనీల జిఎస్టి కేసులో ఫైళ్లలో పలు మార్పులు చేశారని చంద్రబాబు సలహాల మేరకే నడుచుకున్నారని మీడియాలో కదనాలు వచ్చాయి.


ఇదిలా ఉండగా  ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్‌ కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్నా ఆరోపణలతో అధికారులు తొలుత ఆయనపై కేసు నమోదు చేసి.. దాడులు చేపట్టారు. రూ. 200 కోట్లు అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. ఇప్పటి వరకు ఆయన వద్ద నాలుగు కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. గాంధీతో పాటు ఆయన భార్య బొల్లినేని శిరీషపై కూడా కేసు నమోదు చేశారు.


గతంలో హైదరాబాద్‌ ఈడీ కార్యాలయం నుంచి బదిలీ అయినా.. అనధికారికంగా నెలరోజుల పాటు విధుల్లో కొనసాగారని ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో అనేక మంది టీడీపీ నేతలకు అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకోడానికి సహకరించినట్లు ఆయనపై అభియోగాలు మోపబడ్డాయి. అధికారులు ఇ‍ప్పటి వరకు గుర్తించిన ఆస్తుల వివరాలు చాలానే ఉన్నాయి. దాదాపుగా 200 కోట్ల అధిపతిగా బొల్లినేని రికార్డులలోకెక్కిన అధికారిగా ఉన్నారంటే షాకే మరి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: