ప్రజలకు కోపమొస్తే ఏంచేస్తారు.. ధర్నా చేస్తారు.. రాస్తారోకో చేస్తారు.. మరికొందరు నిరసనదీక్ష చేస్తారు. ఇంకొందరు రిలీ నిరాహార దీక్షలు చేస్తారు. కానీ ఇప్పుడు ఇవన్నీ రొటీన్ అయ్యాయి. వీటికి నేతలు స్పందించడంలేదు.


అందుకే.. మహారాష్ట్రలో జనం ఓ మంత్రి ఇంట్లో ఏకంగా ఎండ్రకాయలను తెచ్చి పోశారు.. అలా తమ నిరసన తెలిపారు. మరి ఎండ్రకాయలనే ఎందుకు నిరసన కోసం ఎంచుకున్నారంటారా.. ఎండ్రకాయల వ‌ల్లే రత్నగిరి జిల్లాలోని తివారి డ్యామ్ కి గండిప‌డిందని సదరు మంత్రిగారు త‌నాజీ సావంత్ కామెంట్ చేశారు.


అసలు విషయం ఏంటంటే.. భారీ వర్షాల కారణంగా ఈనెల 3 తివారీ డ్యాంకు గండి పడి 24మంది చనిపోయారు. అయితే డ్యామ్ కి గండి పడటానికి కారణం ఎండ్రకాయలేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ కామెంట్ చేశారు.


ఆనకట్ట చుట్టూ పెద్ద సంఖ్యలో ఎండ్రకాయలు ఉన్నాయని, ఈ కారణంగానే గండిపడిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో జనం కడుపు మండిపోయింది.అందుకే.. జనం ఎండ్రకాయలని పట్టి తెచ్చి మంత్రి ఇంట్లో వేశారు. డ్యామ్ కు గండిపడటంలో మా తప్పు లేదు.. మేము నేరస్థులము కాము అని ఎండ్రకాయలు అంటున్నట్లుగా బ్యానర్లను ప్రదర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: