సరిగ్గా ఏడాదిన్నర క్రితం.. వైఎస్ జగన్ కేంద్రాన్ని ఓ కోరిక కోరాడు.. అప్పట్లో ఆయన అధికారంలో లేడు.. ఆ కోరిక ఏంటంటే.. పక్కా టీడీపీ సానుభూతిపరులైన ఈడీ అసిస్టెంటు డైరెక్టర్ బొల్లినేని శ్రీనివాస గాంధీ, జాయింట్ డైరెక్టర్ ఉమాశంకర్ గౌడ్ ఏళ్లకేళ్లుగా తిష్టవేశారన్నది జగన్ ఆరోపణ.


చంద్రబాబు చెప్పినట్టే నడుచుకునే వీరిద్దరూ తమను అకారణంగా సతాయిస్తున్నారనీ, తమ ఆస్తుల స్వాధీనం విషయంలోనూ అడ్డదిడ్డంగా కక్షసాధింపు నిర్ణయాలు తీసుకుంటున్నారనీ కేంద్రానికి ఫిర్యాదురూపంలో ఓ విజ్ఞప్తి చేశాడు జగన్.


ఈ విజ్ఞప్తి చేసిన కొన్నాళ్లకు కేంద్రం స్పందించింది. సదరు బొల్లినేని గాంధీని ఈడీ నుంచి జీఎస్టీ విభాగానికి బదిలీ చేసింది. అక్కడితో ఆగలేదు. ఆయనపై ఓ కన్నేసి ఉంచింది. దాని ఫలితంగానే ఇప్పుడు సదరు గాంధీ ఇప్పుడు ఏసీబీ కేసులో చిక్కుకున్నాడు.


ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఇళ్లపై సోదాలు జరిగాయి. కేంద్రం ఓ కన్నేసి ఉంచిందంటే.. అందుకు తగ్గ చర్యలు కూడా గట్టిగానే ఉంటాయి కదా.. సో.. చంద్రబాబు నెట్ వర్క్ లో ఓ కీలక అధికారికి మోడీ చెక్ చెప్పారన్నమాట. అదీ జగన్ కోరిన తర్వాత.


మరింత సమాచారం తెలుసుకోండి: