అవును.. ఏపీ సీఎం జగన్ కూడా పాత సీఎం చం‌ద్రబాబు రూట్ లోనే వెళ్తున్నారు. ఏ విషయంలో అంటారా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ప్రజలకు వివరించే విషయంలో సేమ్ టు సేమ్ చంద్రబాబు మార్గాన్నే ఫాలో అవుతున్నారు జగన్.


చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే.. రాష్ట్రంలోని పరిస్థితులపై ఒక్కో రోజు ఒక్కో రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇదీ రాష్ట్ర పరిస్థితి అంటూ ప్రజలను ముందస్తుగా ప్రిపేర్ చేశారు. ఇప్పుడు జగన్ కూడా అదే చేస్తున్నారు.


ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఐదేళ్ల టిడిపి పాలనను శ్వేతపత్రం లో ప్రభుత్వం వివరించనుంది. సచివాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్ది శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.


మరి ఈ శ్వేత పత్రం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.. వాస్తవాలను ప్రజలకు వివరించి వారి సహకారం కోరితే.. జనం అర్థం చేసుకుంటారు. అలా కాకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడం, బురద జల్లడమే లక్ష్యంగా సాగితే.. ఇది కూడా ఓ రాజకీయ జిమ్మిక్కుగా జనం అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: