గవర్నర్ తో ముఖ్యమంత్రి భేటీ అన్నది సర్వ సాధారణ విషయం. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అరుదుగా భేటీలు జరుగుతూ ఉంటాయి. ఆ భేటీలపై అందరి కళ్ళూ ఉంటాయి. ఈసారి చూసుకుంటే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసిమ్హం ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏకంగా గంటన్నర పాటు ఏకాంతంగా భేటీ వేశారు. 


దీని విషయం ఏమై ఉంటుందన్నది ఇపుడు చర్చగా ఉంది. గవర్నర్ షెడ్యూల్లో నిజానికి విజయవాడ ప్రొగ్రాం లేదు ఆయన  ఆకస్మికంగా విజయవాడ రావడంలోని ఆంతర్యం ఏమిటని కదనాలు వచ్చాయి. గవర్నర్ కు షెడ్యూల్ ప్రకారం విజయవాడ ప్రోగ్రాం లేకపోయినా విజయవాడ వచ్చి హోటల్ లో దిగారని, ఆయనను ముఖ్యమంత్రి జగన్ కలిసి పలు అంశాలు చర్చించారని అంటున్నారు.ఇప్పటికే గవర్నర్ తొలి అసంబ్లీ సమావేశాలలో ప్రసంగించినందున ప్రత్యేకంగా చర్చించవలసింది ఏమి ఉంటుందా అన్న తర్జనభర్జన జరుగుతోంది. 


అయితే జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ముఖ్యమంత్రికి వివరించేందుకే నరసింహన్‌ వచ్చారని కొందరు అంటున్నారు. వాస్తవానికి గవర్నర్‌ మూడు రోజులుగా  వ్యక్తిగత పని మీద చెన్నైలో ఉన్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్‌ చేరుకొని,  నిన్న  ఉదయమే విజయవాడ వచ్చారని అంటున్నారు.


ఇదిలా ఉండగా కేంద్ర బడ్జెట్ పై జగన్ తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేయడంతో పాటు, మోడీని పదే పదే ప్రత్యేక హోదా విషయంలో విసిగించడం వంటి వాటి మీద కేంద్ర దూతగా గవర్నర్ వచ్చారని, మోడీ సర్కార్ మనోగతం జగన్ కి వివరిచారని అంటున్నారు. జగన్ సైతం ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గవర్నర్ వద్ద ఏకరువు పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బయటకు చెప్పకపోయినా రాజకీయంగా కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఇది కీలకమైన భేటీ అనే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: