అధికారంలోకి వచ్చిన ఆనందమో.. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్న సంకల్పమో ఏమో గానీ.. ఏపీ కుర్ర సీఎం జగన్.. అడిగినవారికి అడిగినట్టు వరాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలు రకాల ఉద్యోగుల జీతాలు పెంచేశారు. మరికొందరికీ వరాలు అందించారు.


మరోవైపు మద్య నియంత్రణ అంటూ ఆదాయానికి గండి పడినా వెనుకడుగు వేయడం లేదు. అయితే.. ఇవన్నీ సక్రమంగా పది కాలాలు అమలు చేసేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థతి మాత్రం అనుకూలంగా లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చూస్తే జగన్ కు ముందుంది మొసళ్ల పండుగ అనకుండా ఉండలేం.


ఎందుకంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఏభై వేల కోట్ల మేర బిల్లులను పెండింగులో పెట్టి వెళ్లిందట. అంతే కాదు.. కీలకమైన ఈ బిల్లులు వదిలేసి.. ఓట్ల కొనుగోలు పథకాలకు ఖర్చు చేసిందట. ఆర్ధిక నిపుణులు, ప్రభుత్వంలోని ముఖ్యమైనవారు ఆర్ధిక పరిస్థితిపై అద్యయనం చేసినప్పుడు ఈ విషయాలు వెలుగు చూశాయి.


దాదాపు ఏభైవేల కోట్ల మేర బిల్లులు పెండింగులో ఉంచారట. అందులోనూ.. ఆస్పత్రి బిల్లులు, విద్యుత్ సంస్థలకు ఇవ్వవలసిన బకాయిలు వంటి ముఖ్యమైనవి కూడా చెల్లించలేదట. మరి గత ప్రభుత్వం హయాంలో ఆర్ధిక వ్యవహారాలలో జరిగిన ఈ గందరగోళాన్ని జగన్ ఎలా సరిదిద్దుతారో...


మరింత సమాచారం తెలుసుకోండి: