కాపులకు రిజర్వేషన్ కల్పించాలంటూ కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజాగా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.  అంటే ఇంతకాలం స్తబ్దుగా ఉన్న రిజర్వేషన్ల రగడను ముద్రగడ మళ్ళీ తట్టి లేపే ఉద్దేశ్యంలో ఉన్నట్లు అనుమానంగా ఉంది. నిజానికి జగన్ కు ముద్రగడ లేఖ రాయటంలో అర్ధంలేదు.

 

చంద్రబాబునాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు కాబట్టి ఇపుడు జగన్ రిజర్వేషన్ ఇవ్వాలంటూ పద్మనాభం ఎలా అడుగుతున్నారో అర్ధం కావటం లేదు. రిజర్వేషన్లు ఇస్తానని దొంగ హామీ ఇచ్చింది చంద్రబాబు. హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసింది చంద్రబాబు. సరే దానికి తగ్గ ప్రతిఫలం మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు అందుకున్నారు లేండి.

 

అదే జగన్ విషయానికి వస్తే రిజర్వేషన్ల హామీ ఇచ్చి కాపులను మోసం చేయలేనని నిజాయితీగా చెప్పారు. రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వంలోనిది కాబట్టి తాను కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తానన్నారు. జగన్ ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు కాబట్టే ఇటు బిసిలైనా అటు కాపులైనా వైసిపికి ఓట్లేశారు. అంతేకానీ తమకు రిజర్వేషన్లు కల్పిస్తారన్న జగన్ పై  నమ్మకంతో వైసిపికి ఓట్లేయలేదు.

 

కానీ ముద్రగడ మాత్రం తమకు రిజర్వేషన్లు కల్పిస్తారన్న నమ్మకంతోనే కాపులు వైసిపికి ఓట్లేశారు కాబట్టి జగన్ కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలని వితండవాదం మొదలుపెట్టారు. హామీ ఇచ్చింది చంద్రబాబు అయితే అమలు చేయాల్సింది జగన్ అంటూ ముద్రగడ చేస్తున్న డిమాండ్ లో ఏమన్నా న్యాయముందా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: