ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అనేది తెలుగులో పాపులర్ సామెత. ఆ సామెత  బొల్లినేని శ్రీనివాస గాంధికి సరిగ్గా సరిపోతుంది. ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో దాదాపు పుష్కరకాలం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో ప్రత్యర్ధులను ఎన్నో విధాలుగా వేధించిన గాంధి ఇపుడు తానే ఓ కేసులో ఇరుక్కున్నారు. ఇక్కడ ప్రత్యర్ధులంటే ఆయనకు కాదు. చంద్రబాబునాయుడుకు.

చంద్రబాబుకు వీర విధేయునిగా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిలను గాంధి బాగా వేధించారు. అక్రమార్జన కేసుల్లో జగన్ పై అప్పట్లో అనేక కేసులు నమోదైన విషయం తెలిసిందే. సిబిఐ సదరు కేసులను విచారించింది. సిబిఐతో పాటు అవే కేసులను ఈడి కూడా విచారించింది లేండి. అప్పట్లో ఈ గాంధి ఈడిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. ఇంకేముంది చంద్రబాబు చెప్పినట్లుగా అప్పట్లో జగన్ దంపతులను విపరీతంగా వేధించారు.

 

సిబిఐ కేసుల్లో ఎక్కడా భారతి మీద చార్జిషీటు లేకపోయినా ఈడి నుండి మాత్రం భారతి పేరుతో నోటీసులొచ్చాయి. భారతికి నోటీసులిచ్చిన ఈడి అంటూ చంద్రబాబు అండ్ కో విపరీతంగా జగన్ కుటుంబంపై అప్పట్లో బురద చల్లారు. తన కేసులకు భారతికి ఏమీ సంబంధం లేదని జగన్ ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. వైఎస్ కుటుంబాన్ని గబ్బు పట్టించటంలో భాగంగానే నోటీసులు ఇప్పిస్తున్నట్లు వైసిపి అప్పట్లోనే ఆరోపించింది.

 

సీన్ కట్ చేస్తే చంద్రబాబు పదవి నుండి దిగిపోయారు. జగన్ సిఎం అయ్యారు. కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏనే అధికారంలోకి వచ్చింది. గాంధి కూడా ఈడి నుండి  జిఎస్టీ విభాగానికి మారారు. అక్కడ అడ్డదిడ్డంగా దొరికింది దొరికినట్లు మేశారు. దాంతో ఆరోపణలు మొదలయ్యాయ. ఇంకేముంది ? సిబిఐ జరిపిన దాడుల్లో అడ్డంగా బుక్కయిపోయారు. ఇపుడు అక్రమార్జన కేసుల్లో గాంధిపైనే కాకుండా ఆయన భార్య శిరీష మీదు కూడా సిబిఐ కేసు నమోదు చేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: