వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే గ్రామ/ వార్డ్ వలంటీర్ల నియామకం కోసం నోటిఫికేషన్ వి్డుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రామ వలంటీర్లకు జులై 5 వ తేదీతో ధరఖాస్తు గడువు ముగిసింది. వార్డ్ వలంటీర్లకు మాత్రం ధరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. రేపటినుండి ఈ నెల 25 వరకు ధరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు నిర్వహించబోతున్నారు.

 

ఈ ఇంటర్వ్యూలో మొత్తం ఐదు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి 20 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 35 మార్కులు ఓసీ, బీసీ అభ్యర్థులు 40 మార్కులు సాధిస్తే వారిని అర్హులుగా ప్రకటిస్తారు. చైర్మన్, ఇద్దరు సభ్యులు ఇంటర్వ్యూలు నిర్విహిస్తారు. అభ్యర్థులకు ప్రభుత్వ పథకాలపై, రాజకీయాల గురించి అవగాహన ఉండాలి. గతంలో ఎన్జీవోల్లో లేదా ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికయిన వారి వివరాలు మున్సిపల్ కమిషనర్లు నోటీస్ బోర్డులో పొందుపరుస్తారు.

 

గ్రామ వలంటీర్లుగా ఎంపికయిన వారికి 5000 రుపాయలు గౌరవ వేతనం ప్రభుత్వం అందిస్తోంది. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ ఇతర నిత్యావసర వస్తువులు, ఫించన్ గ్రామ వలంటీర్లు ప్రజలకు నేరుగా ఇంటివద్దకు చేర్చబోతున్నారు. ఈ గ్రామ వలంటీర్ల ఉద్యోగాల పట్ల యువత భారీగా ఆసక్తి చూపించటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: