తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్టో మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ రేంజ్ మార్చేసిన సినిమా అది. పెట్టిన పెట్టుబడికి మూడు నాలుగు రెట్ల లాభం తీసుకువచ్చింది ఈ సినిమా. ఈ సినిమా హిట్టైన తరువాత ఇతర భాషల్లోకి కూడా రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ 200 కోట్ల క్లబ్బులోకి చేరింది. ఫుల్ రన్లో ఈ కలెక్షన్లు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 
 
కానీ తమిళంలో మాత్రం ఈ సినిమా పరిస్థితి అయోమయంలో పడింది. మొదట బాల దర్శకత్వంలో నటుడు విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ పేరుతో మొదలుపెట్టారు. కానీ మూవీ తీసిన నిర్మాతలకు, నటుడు విక్రమ్ కు సినిమా తీసిన విధానం నచ్చకపోవడంతో తీసిన సినిమానంతా పక్కన పెట్టి డైరెక్టర్, హీరోయిన్ ను మార్చి అర్జున్ రెడ్డి సినిమాకు పని చేసిన గిరీశయ్యకు ఈ రీమేక్ భాద్యతలు అప్పగించారు. 
 
ఈ సినిమా టైటిల్ కూడా వర్మ కాకుండా అదిత్య వర్మగా మార్చారు. కానీ ఇప్పటివరకు తీసిన సినిమాపై మేకర్స్, నటుడు విక్రమ్ సంతృప్తి వ్యక్తం చేయటం లేదట. ఇలాంటి సినిమాతొ ధృవ్ ను హీరోగా పరిచయం చేయటం కంటే ఈ సినిమాను ల్యాబ్ కే పరిమితం చేయాలని అనుకుంటున్నారట. నిజానికి విక్రమ్ కొడుకు ధృవ్ సరిగ్గా నటించకపోవటం వలనే ఈ సినిమా ఇన్ని సార్లు ఆగిపోతుందని విమర్శలు వస్తున్నాయి. విక్రమ్ లాంటి స్టార్ హీరో కొడుకైనప్పటికీ ధృవ్ మొదటి సినిమా విడుదల కాకముందే ఇన్ని విమర్శలు రావడం ధృవ్ ను ఇబ్బంది పెడ్తుంది. స్టార్ హీరో విక్రమ్ కొడుకైనప్పటికీ ధృవ్ మాత్రం స్టార్ హీరో కావడం కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: