ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు.. బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్.. బీఏసీ సమావేశం జరగడం సాధారణమే. దీనికి అన్ని పార్టీల శాసనసభాపక్షనేతలు హాజరవుతారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏమేం చర్చించాలో నిర్ణయిస్తారు.


ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ నుండి ఆ పార్టీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు, జనసేన నుండి రాపాక వరప్రసాద్‌ హాజరయ్యారు. తెలుగుదేశం తరపున చంద్రబాబు హాజరుకాలేదు.. పార్టీ శాసనసభాపక్ష నేత అయి ఉండీ చంద్రబాబు హాజరుకాకపోవడం ఆసక్తి రేపింది.


అసలు విషయం ఏంటంటే.. ఈ మీటింగ్ పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి హాజరయ్యే సభ్యుల సంఖ్య కేటాయిస్తారు. టీడీపీకి వచ్చిన 23 ఎమ్మెల్యేలకు కేవలం ఒక్కరికే హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంటే బీఏసీలో వైసీపీ వాళ్లు చాలా మంది ఉంటే టీడీపీ నుంచి ఒక్క చంద్రబాబే ఉంటారన్నమాట.


అందుకే దీన్ని అవమానంగా భావించిన చంద్రబాబు.. తన పార్టీ తరపున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చెన్నాయుడిని పంపారు. అందులోనూ..జగన్ ముందు ప్రతిపక్షనేత, శాశనసభాపక్షనేత హోదాలో బీఏసీ మీటింగ్ కు హాజరయ్యేందుకు చంద్రబాబు మనసు అంగీకరించకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: