ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 14 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. రేపు 11 వ తారీఖుతో ప్రారంభమయ్యే సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.


శని, ఆదివారాల్లో సెలవు ఉంటుంది. ఇక ఈ సమావేశాల్లో కీలక ఘట్టాలను ఓ సారి పరిశీలిస్తే... ఈ నెల 12వ తేదీ నుండి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అదే రోజు శాసనమండలిలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.


ఈసారి కూడా వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెడతారు. ఆనవాయితీ ప్రకారం వ్యవసాయమంత్రి కన్నబాబు ఈ వ్యవసాయ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. ప్రతి రోజూ కీలక అంశాలపై ప్రభుత్వం శ్వేత పత్రాలను విడుదల చేసే అవకాశం ఉంది.


జగన్ ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా భావిస్తున్న కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో సభామోదం పొందే అవకాశం ఉంది. ఇక వీటికి తోడు.. కరవు, వర్షాభావ పరిస్థితులు చర్చ జరిగే అవకాశం ఉంది. సభకు సహకరిస్తామని టీడీపీ ప్రకటించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: