ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత దూకుడు పెంచిన విషయం తెలిసిందే.  ఎక్కడ ఏ అవినీతి జరిగినా తాను సహించబోనని..తన ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి  ఇబ్బందులు ఎదుర్కొవద్దని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.  ‘స్పందన’ కార్యక్రమంను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్నారు. స్పందన కంటే ఏ ఇతర కార్యక్రమం ప్రాధాన్యత కాదని, నాణ్యమైన పరిష్కారం ఉండాలన్నారు. హృదయ స్పందన ఉండాలన్నారు.  


శాఖల వారీ పరిష్కారం గూర్చి జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. అన్ని మండలాల్లో స్పందన కార్యక్రమం పక్కాగా నిర్వహించాలని,  కార్యాలయాలు, విద్యాసంస్థలు, వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించాలన్నారు.  గత ప్రభుత్వం పై ప్రజలకు విరక్తి కలగడానికి ఇలాంటి కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయడవల్లే అని అన్నారు.  తన పరిపాలన విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించానని..అధికాకులకు కూడా పదే పదే చెబుతున్నానని..తాను అన్ని విషయాల్లో క్లీయర్ గా ఉన్నానని..ఎలాంటి అవినీతి సహించబోనని అన్నారు. 


అవినీతి అనేది మండల కార్యాలయాల నుండి నిర్మూలించుటకు పూర్తి చర్యలు తీసుకోవాలన్నారు. మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసినా తహశీల్దార్ కార్యాలయంలో డబ్బు ఇస్తేగాని పనికాదు అనే పేరు ఉందని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మునిసిపల్ కార్యాలయం తదితర కార్యాలయాల్లో అవినీతి జరుగుతుందని అధికంగా ఆరోపణలు ఉన్నాయన్నారు.


అన్ని కార్యాలయాలు, వసతి గృహాల్లో ప్రక్షాళన చేయాలన్నారు. 50% ప్రక్షాళనే నా వైపు నుంచి సాద్యం..మిగతా 50% అవినీతి ని అధికారులే నిర్మూలించాలని అన్నారు సీఎం జగన్. అవినీతి అంతం జగన్ ప్రభుత్వం పంతంగా కొనసాగాలి. ఇకపై ప్రభుత్వ నిఘా ద్వారా వచ్చే రిపోర్టుల్లో అవినీతి లేదన్నదే రావాలి..వస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: