ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల కోసం తలపట్టిన గ్రామ వాలంటీర్ల ప్రక్రియ పనులు త్వరిత గతిన పూర్తి చేసుకుంటున్నాయి. అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహించడానికి గ్రామ వలంటీర్లకు గురువారం నుంచి ప్రతి మండలంలోనూ ఇంటర్వ్యూ లు ప్రారంభం చేయనున్నారు. మొత్తం 1,81,885 వలంటీర్ల నియామకానికి గానూ 7,92,334 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 7,59,609 మంది దరఖాస్తులను సక్రమమైనవిగా తేల్చగా.. మరో 2,761 దరఖాస్తులు అధికారుల పరిశీలనలో ఉన్నాయి.

వలంటీర్‌గా పనిచేసే వ్యక్తికి ఉండాల్సిన అర్హత ప్రమాణాలపై మొత్తం 50 మార్కులకు ప్రతి దరఖాస్తుదారునికీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వూ్యలో ఉండే ముగ్గురు అధికారుల్లో చైర్మన్‌కు 50 మార్కులు, మిగిలిన ఇద్దరు సభ్యులకు కలిపి 50 మార్కులు కేటాయిస్తారు. వారు అభ్యర్థికి వేసిన మార్కులను 50 మార్కుల సగటును లెక్కిస్తారు.  అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని   ఎంపిక చేస్తారు.

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళ పోస్టులుగా వర్గీకరిస్తారు. కాగా ఒక గ్రామంలో వలంటీర్ల నియామకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఒకే రోజున ఇంటర్వ్యూ జరపాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మండలానికి 700కి పైగా దరఖాస్తులు వచ్చిన చోట అదనంగా ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. తొలి రోజు ఒక్కొక్క మండలంలోని ఇంటర్వ్యూ బోర్డు కేవలం 30 మంది అభ్యర్థులనే పిలవాలని, రెండో రోజు నుంచి రోజూ 60 మందికి చొప్పున ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యనే ఇంటర్వ్యూ నిర్వహించాలని సూచించారు.

ఆ రోజు పిలిచిన అభ్యర్థులందరినీ అదే రోజు ఇంటర్వ్యూ పూర్తి చేసి పంపాలి. తప్పనిసరి పరిస్థితులలో అభ్యర్ధులు మిగిలినప్పుడు వారిని మరుసటి రోజు మొట్ట మొదట ఇంటర్వ్యూ చేయాలి.  24, 25 తేదీల్లో తిరస్కరించిన, మిగిలిపోయిన అభ్యర్థుల ఇంటర్వ్యూల కోసం 26వ తేదీని రిజర్వ్‌ చేశారు. దరఖాస్తుదారుల్లో మహిళలను, దివ్యాంగులను ఇంటర్వ్యూ జరిగే రోజు సాయంత్రం 2.30 – 5.30 గంటల మధ్య  మాత్రమే పిలవాలి. అభ్యర్థులు ఫొటో ఐడి, జిరాక్స్‌ కాపీలు, సంబంధిత పత్రాలను తీసుకుని ఇంటర్వూ్యకు 30 నిమిషాల ముందుగా హాజరు కావాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: