దేవాదాయ, ధర్మాదాయ శాఖ లో బదిలీలు జరుగుతున్నాయి. జీవో ప్రకారం అధికారులను జిల్లా మార్చాల్సి ఉంటుంది. మరి ఎందుకు నిబంధనల పాటించడం లేదు అని ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం లోని కీలక అధికారి , పరిపాలన విభాగం లోని అక్రమార్కులు వారు అనుకున్నదే చేస్తున్నారా ? అని ఆరోపణలు. గత 5 ఏళ్ళు ఇక్కడే ఉన్నా ఉద్యోగులు విజయవాడను వదిలెందుకు వారూ ఏ మాత్రం సుముఖంగా లేరు. అంతే అధికారులు అంతా రింగ్ కు పరిమితమయ్యారు.

పశ్చిమ నియోజకవర్గం లోని వెంకటేశ్వర ఆలయంలో అధికారిని పాత శివాలయం కు బదిలీ చేశారు. అంటే నియజకవర్గం కూడా మార్చకుండా అదే ఊరిలో బదిలీ చేయడంతో కనీసం నిజకవర్గం కూడా మార్చటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నడంతో మరి ఇదేమీ బదిలీలు అంటూ విమర్శలు చేస్తున్నారు మిగిలిన అధికారులు.

సత్యనారాయణ పురం శివాలయం ఈ ఓ అధికారి పై అప్పట్లో చీరలు మాయం ఘటన పై ఫిర్యాదులు వచ్చాయి. ఆ చీరలను అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధి , అధికారి పంచుకున్నట్టు విమర్శలు.  ఐనా సదరు అధికారి పై కనీసం విచారణ చేయలేదు. దేవాదాయశాఖ పరిస్థితి దయనీయంగా ఉంది అని భక్తులు వాపోతున్నారు.

మాచవరం లో ఉన్న దాసాంజనేయ స్వామి ఆలయం లో ఉన్న అధికారి నగరంను విడిచేదే లేదు అని చెబుతున్నారు. నగరంలో ఉన్న అధికారులు ఇక్కడే ఉంటూ అందుకు వారు భారీ ప్తెరవీలు చేస్తున్నారు. యనమలకుదురు శివాలయం  అధికారి నగరంలో ఉందెందుకు కమిషనర్ కార్యాలయం అధికారి ఆశీస్సులు పొందారు అని ప్రచారం జరుగుతోంది. కనీసం నియజకవర్గం ను వీడనని వేంకటేశ్వరస్వామి ఆలయ అధికారి డిసైడ్ అయ్యారు అని అందుకు పరిపాలన విభాగం లో ఉన్న అక్రమార్కులు అండ ఉంది అని ఆరోపణలు.

ఇంకా జిల్లా లొ చాలామంది అక్కడే తిష్ట వేస్తే ఆ ప్రభావం (షాపులు అద్దెలు, కౌళ్లు, దర్శనం టిక్కెట్లు) దేవస్థానము ఆదాయ వ్యయాల్లొ తేడాలొచ్చే ప్రభావం ఉందని భక్తులు ఆరోపిస్తున్నారు..  దేవాదాయశాఖ లో బదిలీలు పారదర్శకత తో జరిగేనా అని చర్చ జరుగుతోన్న సందర్భంలో ఎం జరుగుతుందో చూడాలి...


మరింత సమాచారం తెలుసుకోండి: