చుట్టూ సముద్రం నీరు మధ్యలో ఊరు.. ఊరు చుట్టూ ఎన్ని నీళ్లున్నా ఉపయోగం ఏముంటుంది.  తాగడానికి పనికిరాదు.  సాగు చేసుకోవడానికి అక్కరకు రాదు.  సముద్రం నీరును ఉప్పు తయారు చేసుకోవడానికి తప్పించి ఎందుకు ఉపయోగించుకోలేము. 

ఇప్పుడు ఈ ఉప్పునీరే చెన్నై నగరానికి దిక్కైంది.  నగరం నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నది.  తాగేందుకు చుక్క నీరు దొరకడంలేదు.  ఉన్న వాళ్ళకే నీరు దొరకడం లేదు.  కొత్తగా నగరానికి వచ్చే వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది.  హోటల్స్ లో మాములు ప్లేట్స్ స్థానంలో అరిటాకులు, పేపర్ ప్లేట్స్ ఉపయోగించడం మొదలు పెట్టారు.  తాగేందుకు నీరు కావాలంటే కొనుక్కోవలసిందే.  


అప్పుడెప్పుడో అనుకున్నారు నీటి కోసం యుద్దాలు వస్తాయని.. ఇప్పుడు అది నిజం అయ్యేలా ఉన్నది.  చెన్నై నుంచే ఆ యుద్దాలు ప్రారంభం కావొచ్చు.  చెన్నై వాసులు ఇప్పుడు సముద్రంవైపు తరలివెళ్తున్నారు.  ఎందుకని ఆశ్చర్యపోకండి.  అక్కడికే వస్తున్నా.. 


నీళ్లు దొరకడం లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులను శుభ్రం చేసుకోవాలి అంటే నీళ్లు కాబట్టి సముద్రం దగ్గరికి వెళ్లి ఆ నీటిని తెచ్చుకుంటున్నారు.  వాటితో నిత్యావసర కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు.  జూన్ లో పడాల్సిన వానలు ఇప్పటి వరకు కురవకపోవడంతో ఈ ఇబ్బందులు వచ్చాయి.  మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే.. అనుకున్నట్టుగానే యుద్దాలు వస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: