గడిచిన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఏపీలో కోట్లాది రూపాయ‌ల‌ను ప్ర‌చారాలు, హంగులు, ఆర్భాటాల‌కు వాడుకున్నారు. ఐదేళ్ల‌లో రాష్ట్ర అభివృద్ధి కేవ‌లం కాగితాల‌పై మాత్ర‌మే ఉందే కాని.. వాస్త‌వంగా జ‌రిగిన అభివృద్ధి లేదు. తాజా బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఏపీ ఆర్థిక‌ప‌రిస్థితి ఆర్థిక‌మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి వివ‌రించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై రూ.3లక్షల 61వేలకోట్ల అప్పుల భారం ఉందంటున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఐదేళ్ల‌లో ఏపీ అస్తవ్యస్థమైందని ఆరోపించారు. ఏ రంగంలోనూ పురోగమనం చూడలేదని.. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పడం అబద్ధమన్నారు. గత ఐదేళ్లలో ఆర్థిక పరిస్థితిని బుగ్గన వివరించారు. ఏపీ అప్పుల కుప్ప‌గా మారిపోయింద‌న్నారు.


ట్విస్ట్ ఏంటంటే ఐదేళ్ల బాబు పాల‌న‌లో ఏపీలో వ్య‌వ‌సాయ రంగంలో వృద్ధి రేటు న‌మోదు అయిన‌ట్టు చూపించారు. అయితే ఈ లెక్క‌ల‌న్నీ త‌ప్పు అని కూడా బుగ్గ‌న చెప్పారు. చేపల, గొర్రెల పెంపకాల్లో వృద్ధిరేటు పెరగిందని.. వ్యవసాయ రంగం వృద్ధిరేటు పెరిగిందంటూ అంచనాలు తారుమారు చేశారన్నారు. చేపల పెంపకం పెరిగినందన్న మాత్రాన వ్యవసాయ వృద్ధి రేటు ఎలా పెరుగుతుందంటూ ప్రశ్నించారు. 


ఐదేళ్ల బాబు పాల‌న అంతా కేవ‌లం ఓవ‌ర్ డ్రాఫ్ట్ మీదే బతికింద‌ని.. టీడీపీ స‌ర్కార్ ఓడిపోయే ముందు రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప‌గా మార్చేసి పోయింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. అంగన్ వాడీలు, హోం గార్డ్స్ , విద్యారంగం ఇలా అన్ని విభాగాల్లోనూ పెండింగ్ బిల్లులు భారీగా ఉన్నాయన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: