కొద్దిరోజుల క్రితం....ఏపీ రాజ‌ధాని ప్రాంత‌మైన మంగ‌ళ‌గిరిలో చోటు చేసుకున్న ఘ‌ట‌న గురించి తెలుగుదేశం పార్టీ గ‌గ్గోలు పెట్టిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది.  పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన తాడిబోయిన ఉమాయాదవ్‌ రాత్రి ద్విచక్రవాహనంపై వెనుక కూర్చుని ఇంటికి వెళ్తుండగా నలుగురు దుండగులు అటకాయించి కత్తులతో మెడపై ముఖంపై నరికి దారుణంగా హత్య చేశారు. ఎప్ప‌ట్లాగే పట్టణంలోని కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి ఇస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘ‌ట‌న‌లో తాజాగా నిందితులుగా పోలీసుల‌ను కోర్టులో హాజ‌రుప‌రిచారు. ప్రధాన ముద్దాయి తోట శ్రీనివాస రావు వజీర్ లతోపాటు దేశం నాయకులు ఉండ‌టం సంచ‌ల‌నంగా మారింది.


2016లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని బేతపూడి సర్పంచ్‌ సాయిప్రసాద్‌ను కురగల్లు గ్రామం వద్ద కారులో వస్తుండగా కత్తులతో దాడి చేసిన ఘటనలో ప్రథమ మద్దాయి ఉమా యాదవ్‌. అప్పట్లో పోలీసులు ఈయనపై రౌడీ షీట్‌ తెరిచారు. బెయిల్‌పై బయటకు వచ్చిన ఉమాయాదవ్‌ టీడీపీ హయాంలో ఓ పోలీస్‌ అధికారి సాయంతో అనేక భూవివాదాల్లో తలదూర్చేవారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొంత కాలంగా సెటిల్‌మెంట్లతోపాటు డబ్బులు విషయంలో తేడాలు వచ్చిన కారణంగానే ఉమాయాదవ్‌ను హత్యకు గురైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ద్వారకానగర్‌లో ఇరువర్గాలుగా ఉన్న నాయకులు తమ ఆధిపత్యం కోసం ఉమాయాదవ్‌ను హత మార్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. 


కాగా,  ఆ హత్య చేసింది మేమే అంటూ వైసీపీ నేత తోట శ్రీనివాసరావు యాదవ్ పాటు అతని అనుచరులు లొంగిపోయారు. అయితే, సంచలనం సృష్టించిన ఉమా యాదవ్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి తోట శ్రీనివాసరావు, వజీర్‌లతోపాటు దేశం నాయకులు ఏనుగ కిషోర్, బుల్లబ్బాయి, చావలి మురళితో పాటు 11 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్య వైసీపీ వాళ్లే చేసారని ఆరోపిస్తూ టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ పరామర్శ కార్యక్రమాలను ఇటీవల నిర్వహించి అధికార పార్టీపై ఆరోపణలు చేయడం కొసమెరుపు. తాజా ప‌రిణామాల‌తో వారు షాక్ తిన‌డం ఖాయ‌మంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: