ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకు రావాలని అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు,కానీ రోజు రోజుకి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారుతుంది,ముఖ్యంగా తెలంగాణలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది కేవలం ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే 4000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది ప్రభుత్వం.మూసివేసిన విద్యాలయాల్లోని విద్యార్థులను, ఉపాధ్యాయులను తక్కిన విద్యాలయాలకు బదిలీ చేసింది.స్కూళ్లను మూసివేయడం పై పిల్లల తల్లిదండ్రులు నిరాశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే వారి సంఖ్య రోజు రోజుకి తక్కిపోతుండటంతో ప్రభుత్వ యంత్రాంగం స్కూళ్ల పనితీరులో,స్కూళ్ల బోధన విధానంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్, షూస్, పాఠ్యపుస్తకాలతో పాటు స్కాలర్ షిప్పులు కూడా ఇస్తున్నారు.
ఖాళీ కడుపు ఎప్పటికి విద్యాభ్యాసానికి ఆటంకం కాకూడదని మధ్యాహ్నం భోజన కూడా పెడుతుంది.కేవలం సాధారణ భోజనం పెట్టి కడుపు నిపడమే కాదు పిల్లలకు పోషక విలువలతో కూడిన భోజనాన్ని అందించాలని ఆశిస్తోంది కేంద్ర ప్రభుత్వం అందుకోసం  మధ్యాహ్న భోజనంలో రాగిముద్ద లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 6,7,8 తరగతుల బాలికలకు వారంలో మూడు రోజులు రాగి ముద్ద లు అందించనున్నారు. ఇందుకోసం ఏడాదికి 8 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా.


మరింత సమాచారం తెలుసుకోండి: