చిత్ర పరిశ్రమలో వారసత్వం అనేది ఆనవాయితీ,కుటుంబంలో ఒకరు హీరో అయితే చాలు,ఒకటో రెండో హిట్లు కొడితే చాలు వరసగా ఫ్యామిలీ లో అందరూ వెండితెర మీదకి దూకేస్తుంటారు. ఆ వరసలో ముందు గుర్తొచ్చే పేరు మెగా ఫ్యామిలీ ది ఎందుకంటే ఒక్క మెగా ఫ్యామిలీ నుండే 8మంది హీరోలు ఇండస్ట్రీని ఉపేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పేరుచెప్పుకుని మొదట కెరీర్ స్టార్ట్ చేసినా తర్వాత తమ టాలెంట్ తో అవకాశాలను,అభిమానులను సంపాదించుకుంటున్నారు. ఇంత మంది మెగా హీరోల మధ్య తన లక్ ని పరీక్షించుకుందాం అని ఇండస్ట్రీలో కి అడుగు పెట్టింది మెగా వారసురాలు "నిహారిక" కొణిదెల,పెదనాన్న ఆశీస్సుసులు,బాబాయ్ ఫాన్స్ వెనక ఉన్నప్పటికీ ఇంత వరకు ఒక్క విజయాన్ని కూడా ఈ అమ్మడు దక్కించుకోలేదు.

ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం మూడు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వెండితెర కు గుడ్ బై చెప్పాలనుకుంటుంది ఈ మెగా వారసురాలు, ఇకపై కేవలం వెబ్ సిరీస్ లలోనే నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: