కర్ణాటకలో ప్రభుత్వం సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు.  ఇలా సడెన్ గా రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.  అటు గవర్నర్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.  


పదిమంది ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు కూడా రాజీనామా చేయడం విశేషం.  ఇక్కడ ఇలాంటి సంక్షోభం జరుగుతుండగా గోవాలో కూడా ఇదే విధమైన సంక్షోభం జరిగింది.  అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది.  


2017 లో  ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీని ఇవ్వలేదు.  దీంతో బీజేపీ ఇండిపెండెంట్ మరో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ మరణించడంతో ఆ స్థానంలో ప్రమోద్ సావంత్ ముఖ్యమంత్రి అయ్యారు.  


ప్రభుత్వం సజావుగా సాగుతున్నది.  ఇంతలో రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడింది.  కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.  వీరిని సపరేట్ గా గుర్తించాలని గవర్నర్ కు, స్పీకర్ కు లేఖను అందించారు.  గోవాలో 17 మంది సభ్యులున్న కాంగ్రెస్ పార్టీ బలం దీంతో 7 కు పడిపోయింది.  కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈ పదిమంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో జాయిన్ అవుతారని తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: