దేశవ్యాప్తంగా గత రెండు దశాబ్దాలలో 3లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు జరిగాయి. వీటిలో మహారాష్ట్రలోనే అరవై వేలకు పైగా జరిగాయి. విదర్భ ప్రాంతంలో ఎక్కువ జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిక్ట్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2014-19 మధ్య కాలంలో 1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! అలాంటి వారి కోసం విధానాలు రూపొందించే ప్రభుత్వ యంత్రాంగానికి అసలు కారణాలు తెలుసా? అని ఇంత కాలం నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలకు ఏపీ ముఖ్యమంత్రి మానవీయ నిర్ణయం తీసుకున్నారు.

1,513 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని లెక్కలు చెబుతుంటే, గత ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. దీనిపై జగన్‌ ఈ రోజు జరిగిన సమావేశంలో...

' రైతు ఆత్మహ్యతలకు సబంధించి కలెక్టర్లు తమ జిల్లాల్లోని డేటాను పరిశీలించాలి. అర్హులైన రైతు కుటుంబాలకు వెంటనే పరిహారం అందజేయాలి. కలెక్టర్‌, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లాలి. వారి కుటుంబాల్లో ఆత్మస్థైర్యం నింపాలి. ఎక్కడైన సరే రైతు కుటుంబాల్లో జరగరానిది జరిగితే కలెక్టర్లు స్పందించాలి. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 7లక్షలు పరిహారం ఇవ్వడమే కాకుండా.. ఆ మొత్తాన్ని వేరొకరు తీసుకోలేని విధంగా చట్టాన్ని కూడా తీసుకొస్తాం. '' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌ ఈ రోజు తీసుకున్న చారిత్రక నిర్ణయం వైపు దేశంలోని ప్రతీ రైతు ఆసక్తిగా చూస్తున్నారు. ఇదొక సంచలనం , ఆదర్శనీయం అని, రైతుల కోసం పని చేసే సంస్ధలు అంటున్నాయి. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి రైతుల కోసం ఇంత సీరియస్‌గా స్పందించ లేదు. తెలంగాణలో కేసీఆర్‌ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆత్మహత్యలు   చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉండాలని పలువురు తెలంగాణ రైతులు కోరుతున్నారు.

జగన్‌ తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తున్న కేసీఆర్‌ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవలను కుంటున్నట్టు అనధికార వర్గాలు సమాచారం. అందుకే ఈ రోజు   కేసీఆర్‌ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ  ''  ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం పట్ల దృష్టిసారించామన్నారు. గ్రామాల్లో మూడు నెలల్లో మంచి మార్పు చూడబోతున్నామని...''  కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చి దీవించారని ఈ సందర్భంగా  అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: