సరిగ్గా మూడు నెలలు.. ఈ మూడు నెలల్లో తెలంగాణ ప్రజలు స్పష్టమైన మార్పు చూడబోతున్నారట.. ఇంతకీ ఈ మూడు నెలల్లో ఏం జరగబోతోంది.. ఈ 90 రోజుల్లో కేసీఆర్ ఏం మాయ చేయబోతున్నారు..?


ఈ ముడు నెలల్లో కేసీఆర్.. నగర, రెవెన్యూ, గ్రామీణ విధానాల్లో సమూలంగా మార్పులు తెస్తారట. ఈ మార్పుల కారణంగా లంచగొండితనం, అవినీతిని నిర్మూలిస్తారట. లంచాలు లేని పాలన, ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని కేసీఆర్ అంటున్నారు.


జీరో స్థాయికి అవినీతి చేరుకునే విధంగా పట్టణ విధానం ఉండాలని ఆయన అంటున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేశామని కేసీఆర్ అన్నారు. పెద్ద సమస్యలైన మంచినీరు, సాగునీరు, విద్యుత్‌ సమస్యను అధిగమించామని గుర్తుచేశారు.


కేవలం ఓట్లే పరమావధిగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం పట్ల దృష్టిసారించామన్నారు. గ్రామాల్లో మూడు నెలల్లో మంచి మార్పు చూడబోతున్నామని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. మరి ఆ మార్పు సాకారమైతే మంచిదే.. చూద్దాం.. కేసీఆర్ మాటలు ఎంత వరకూ నిజమవుతాయో..!


మరింత సమాచారం తెలుసుకోండి: