తెలుగుదేశం అధినేత చంద్రబాబు వారసుడు నారా లోకేశ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆయన మొన్నటి ఎన్నికల్లో స్వయంగా మంగళగిరి నుంచి ఓడిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఓడిపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు అంధకారంగా మారింది.


ఇలాంటి సమయంలో ఆయన సరిగ్గా మీడియా ముందుకు కూడా వచ్చే పరిస్థితి లేదు. కేవలం ట్వీట్ల ద్వారా విమర్శలు చేస్తూ.. రాజకీయంగా ఉనికి కాపాడుకుంటున్నారు. ఈ పరిస్థితులతోనే లోకేశ్ సతమతం అవుతుంటే ఇప్పుడు మరో కొత్త కష్టం వచ్చి పడుతోంది.


పార్టీని విడిచి పెట్టి వెళ్లే నేతలు నారా లోకేశ్ పై విమర్శలు చేసి వెళ్తున్నారు. నారా లోకేశ్ నిర్వాకం వల్లే ఎన్నికల్లో ఓడామని బండలు వేసి.. చక్కా పార్టీ మారుతున్నారు. దీని కారణంగా అసలు గందరగోళంగా ఉన్న లోకేశ్ ఇమేజ్ మరింతగా మసకబారుతోంది.


లోకేశ్ కు పార్టీని నడిపే సత్తా లేదని.. కనీస అర్హతలు లేవని పార్టీ వదిలి వెళ్లే నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు.. వైసీపీ నేతలు కూడా లోకేశ్ ను విమర్శలతో ఓ ఆట ఆడుకుంటున్నారు. కనీసం గుంటూరు, మంగళగిరి, డెంగ్యూ పదాలు సరిగ్గా పలకాలని సెటైర్లు వేస్తున్నారు.. పాపం.. ఇది లోకేశ్ కు కష్టకాలమే.


మరింత సమాచారం తెలుసుకోండి: