టీడీపీ పార్టీ ఓటమి తరువాత ఇప్పుడు ఒక్కొక్కరు బయటికొచ్చి తమ అసంతృప్తిని బయటికి చెబుతున్నారు. టీడీపీకి గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. శాసనమండలిలో తన రాజీనామా పత్రాన్ని కూడా అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సతీష్.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా మాజీ మంత్రి నారాయణను టార్గెట్ చేశారు. 


ఏ అర్హత లేని వ్యక్తుల్ని నేరుగా తీసుకొచ్చి పదవుల్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. ఏ అర్హత ఉందని.. రాజకీయాలతో సంబంధం లేని నారాయణకు మంత్రి పదవి ఇచ్చారని ప్రశ్నించారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని వ్యక్తికి పదవి ఎలా ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తీరు నచ్చకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సతీష్ పెద్ద బాంబ్ పేల్చారు. పార్టీ మీద కానీ, పార్టీ నిర్మాణం మీద కానీ లోకేష్‌కు కనీసం అవగాహన లేదన్నారు. 


అన్ని నియోజకవర్గాల్లో లోకేష్ గ్రూపులు తయారు చేశాడన్నారు సతీష్. అతని వల్లే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైందని.. తెలిసీ తెలియని తనంతో లోకేష్ పార్టీని నాశనం చేశారన్నారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవని లోకేష్‌కు రాజకీయపరిజ్ఞానం లేని వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి దీనికి తోడు మంత్రి పదవి కూడా కట్టబెట్టారని మండిపడ్డారు. లోకేష్ తానేదో పార్టీని ముందుండి నడిపిస్తున్నట్టుగా ఫీలయ్యేవారని.. ఏం అనుభవం ఉందని ఆయనకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారో చెప్పాలన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: