ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు పురుషులే. ఒక్కరు కూడా మహిళా ముఖ్య మంత్రి లేరు, పురుషులదే తెలుగు రాజ్యం.  రూలింగ్ పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా పురుషులే రాజకీయ వారసులు. పురుషులే వర్కింగ్ ప్రెసిడెంట్లు, పురుషులే జాతీయ ప్రధాన కార్యదర్శులు. ఏమి ఆడపిల్ల రాజకీయ వారసురాలు అయితే మీ పురుషుల విలువ తగ్గుతుందా ? లేక మీ ఇంటి పేరు మారిపోతుందా ?


1966 లోనే ఇందిరా గాంధీ భారత దేశం మహిళా ప్రధాన మంత్రిగా దేశాన్ని గడగడాలు ఆడించిన దేశం మనది. మహిళా అయినా, పురుషుడు అయినా దేశాన్ని చెక్కదిద్దే వారు ఎవరైనా ప్రధాని అవ్వచ్చు అని, రాజకీయానికి విద్యార్హత, ఆర్ధిక అర్హత, కులం, మతం అవసరం లేదు అని తెలిపిన రోజులు అప్పట్లోనే ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు అవి ఎందుకు తెలియడం లేదు. తెలుగు రాజ్యంలో ముఖ్యమంత్రి భార్యగా ఉండాలి తప్ప మహిళకు ముఖ్యమంత్రి అయ్యే స్వేచ్ఛ తెలుగు రాష్ట్రాల మహిళలకు లేదా ? 


లేదు ? తెలుగు రాష్ట్రాల మహిళలకు ఆ అవకాశం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇద్దరు పిల్లలు. ఒకరు అబ్బాయి, ఒకరు అమ్మాయి. కేసీఆర్ తరువాత తన రాజకీయ వారసుడు కేటీఆర్. కేసీఆర్ కూతురు కవిత ఇంటి పేరు మార్చలేదు కాదండి. కల్వకుంట్ల కవితనే కదా. ఆమెని ఎందుకు రాజకీయ వారసురాలిగా ప్రకటించలేదు. ఇటు వైపు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర కలవాడు. కానీ ఏమి ప్రయాజనం అతని పుత్రుడుకి రాజకీయ జ్ఞానం లేదు, ఎవరిని విమర్శించాలో ఎవరిని విమర్శించకూడదో కూడా తెలీదు ఆ అజ్ఞానికి. రాజకీయ జ్ఞానం ఉన్న కోడలు నారా బ్రహ్మీని రాజకీయాలలో లేదు. 


ఇప్పుడు .. సంచలన నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటా అంట ... 'కేసీఆర్'కి, 'చంద్రబాబు'కి కొడుకులు ఉన్నారు కానీ మన 'జగన్'కి ఇద్దరు కుమార్తలే. ఇతనైనా తన కుమార్తలలో ఒకరినైనా రాజకీయ వారసురాలు అని ప్రకటిస్తారు అనుకుంటే కాదట! జగన్ గారి చెల్లి షర్మిలమ్మ కొడుకు 'రాజా రెడ్డి' వైఎస్ జగన్ రాజకీయ వారసుడట.. వారసుడు అని ఇంకా ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటించాల్సి వచ్చిన మీడియా గుసగుసలు ఆడుతున్నట్టు అదే చెయ్యచ్చు. మగపిల్లాడు కదా అలానే చెయ్యచ్చు.. చెప్పలేం.. 


ఏంటండీ ఇది.. మగాపిల్లడు అవుతే చాలా, రాజకీయ వారసుడిగా ప్రకటించేస్తారా ? ఆడపిల్లలు తెలుగు రాష్ట్రాలను పరిపాలించలేరా ? లేక ఇంతమంది మగాళ్ళం ఉండి రాష్ట్రమంతా ఆడదాని చేతిలో పెట్టాలా అనే అహంకారామా ? అలాంటి అహంకారమే తమిళనాడులో ఉంటె అమ్మ 'జయలలితమ్మ' వచ్చి ఆ అహంకారాన్ని ముక్కలు చేసి, తమిళనాడు ప్రజలకు స్వర్గాన్ని చూపించింది ఆమె పాలనతో. ఏ మొగడైతే అహంకారంతో విర్రవీగాడో ఆ మగాళ్లతోనే అమ్మ అని అనిపించుకుంది 'జయలలితమ్మ'. 


మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతే సరిపోదు. మన తెలుగు రాష్ట్రలలో మహిళల ముఖ్యమంత్రి కావాలి. ఆ మహిళా ముఖ్యమంత్రి రాజ్యాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో ఈ తెలుగురాష్ట్రాల పురుషులు చూడాలి. ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన రాజకీయ వారసుడిగా మేన అల్లుడిని ప్రకటించలేదు. కానీ ఎప్పుడోకప్పుడు ప్రకటించాలి. ఇద్దరు కన్నకూతుర్లని పెట్టుకొని మేన అల్లుడుకు రాజకీయ వారసుడిగా ప్రకటించి.. మహిళల భవిష్యేత్తుని అంధకారం చేస్తాడా ? లేక కూతుర్లకు రాజకీయం నేర్పించి రాజకీయ వారసురాలిగా ప్రకటించి మహిళల భవిష్యేతును అందంగా తీర్చిదిద్దుతాడా అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతిలోనే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: