జగన్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.  అందరికి నచ్చే విధంగా పధకాలు ప్రవేశపడుతున్నారు.  పధకాలు ప్రవేశపెట్టడమే కాదు వాటిని అమలు చేస్తున్న తీరు కూడా అలానే ఉంటోంది. 


ముఖ్యంగా రైతుల కోసం జగన్ రైతు బంధు పధకం ప్రవేశపెట్టారు.  వాటిద్వారా రైతులకు లబ్ది చేకూరేలా చూస్తున్నారు.  దీంతో పాటు రైతుల ఆత్మహత్యల విషయంపై కూడా దృష్టిపెట్టారు.  గత ఐదేళ్ళలో 1513 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే నష్టపరిహారం చెల్లించింది.  


దీనిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.  ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం చలించే విధంగా చూడాలని ప్రభుత్వ అధికారారులకు ఆదేశాలు జారీ చేశారు.  ఈ ఆదేశాల ప్రకారం, ఒక్కో రైతు కుటుంబానికి 7 లక్షల నష్టపరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు.  


ఈ మొత్తాన్ని వేరొకరు ముట్టుకోకుండా డైరెక్ట్ గా ఆ కుటుంబానికి చేరేలా చట్టం తీసుకురాబోతున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది.  ఇదే విధంగా తెలంగాణాలో కెసిఆర్ అమలు చేయబోతున్నారని తెలుస్తోంది.  ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: