ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా... స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సర్వ అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు.  ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దొబ్బేశారని వ్యాఖ్యానించారు. దీంతో దొబ్బేయడం(దొంగలించడం) అనే పదాన్ని వాడటంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు.

స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ ఆన్ పార్లమెంటరీ పదాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రికి సూచించారు. స్పీకర్ ఆదేశాలను గౌరవించి మంత్రి అనిల్ కుమార్ తన మాటలు వెనక్కి తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సర్వహక్కులు వైఎస్ కే ఉన్నాయనీ, ఈ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా తామేనని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: