ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు పక్షాల మద్య వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 14 రోజుల పాటు సమావేశాలు జరగనుండగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో గతంలో  కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో వ్యతిరేకించిన సీఎం జగన్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభోత్సవానికి వెళ్లడంపై టీడీపీ నేతలు ప్రశ్నలు కురిపించారు. 

దీనికి వెంటనే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ...కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్ వెళ్లింది ఎప్పుడు అధ్యక్షా...అది పూర్తి అయ్యాక, ఒకవేళ అక్కడికి జగన్ వెళ్లినా..వెళ్లకున్నా అక్కడ వారు మీట నొక్కేవారు..నీళ్లు వచ్చేవి. అయితే గత ఐదేళ్లలో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తి చేస్తుంటే అప్పటి సీఎం హోదాలో ఉన్న చద్రబాబు ఇక్కడ ఉండి  ఏం గాడిదలు కాశాడు అని అడుగుతున్నా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాంతో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పారు..సభా ప్రాంగంలో ఇలా నోరు జారితే ఎలా అని ప్రశ్నించారు.  ఈ విషయంపై జగన్ స్పందించి.. టీడీపీ నేతలకు సామెతకు అర్థం తెలీదు. ఎలా మాట్లాడాలో అంతకన్నా తెలియదు అని దుయ్యబట్టారు. అంతే కాదు అధ్యక్షా..వీరు అధికారంలో ఉన్న సమయంలో ఆల్మట్టీ డ్యామ్ కడుతున్న విషయం తెలిసిందే..అప్పట్లో ఎన్డీయేలో భాగస్వామి అయిన చంద్రబాబు ఏదో ఉద్దరిస్తారని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆల్మట్టి ఎత్తును కూడా పెంచేశారు.

దీనివల్ల గత 47 ఏళ్ల సరాసరి  తీసుకుంటే మనకు 1100 టీఎంసీలు వచ్చినట్లు ఉంది. అదే సమయంలో గత 10 సంవత్సరాల్లో కృష్ణానది నుంచి ఎన్నినీళ్లు కిందకు వస్తున్నాయో చూస్తే ఈ సంఖ్య 500-600 టీఎంసీలకు పడిపోయింది’ అని సీఎం జగన్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: