ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత తనను నమ్ముకున్న వారికి మంచి పదవులు ఇస్తూ సంతోష పెడుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆనాటి అసెంబ్లీలో తెలుగు దేశం పార్టీ నాయకులు ముచ్చెమటుల పట్టించి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నటి, నగరి ఎమ్మెల్యేకు కీలక పదవి ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నగరి ఎమ్మెల్యే రోజా నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వలేదని ఎంతో మంది జగన్ పై విమర్శలు చేసినప్పటికీ..ఎమ్మేల్యే రోజా మాత్రం తనకు తప్పకుండా సీఎం న్యాయం చేస్తారని మొదటి నుంచి చెబుతూనే ఉంది. అనుకున్న విధంగానే రోజాకి అదృష్టం కలిసి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీఐఐసీ) చైర్‌పర్సన్‌గా నియమిస్తూ..సీఎం జగన్.. జూన్ లోనే రోజాకు ఏపీఐఐసీ  చైర్మన్ పదవిని ఖరారు చేశారు. అధికారిక ఉత్తర్వులు మాత్రం ఇప్పుడు జారీ చేశారు. రోజా నియామకంతో చిత్తూరు జిల్లాకు మరో కీలక పదవి లభించినట్టైంది. కాగా, ఇప్పటికే జిల్లా మంత్రులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  కళత్తూరు నారాయణస్వామికి పదవులు దక్కాయి.

తుడా చైర్మన్‌గా, ప్రభుత్వ విప్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పారిశ్రామిక రంగం డెవలప్ అవుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సత్యవేడు శ్రీసిటీ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏపీఐఐసీ తరఫున పారిశ్రామిక క్లస్టర్లు మరిన్ని ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఆనందాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏపి ప్రజలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: