మాములుగా అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఇరుకున పడేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుంటాయి.  రాష్ట్రంలో ఉన్న సమస్యలను ఎత్తి చూపిస్తూ.. అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తాయి.  అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రతిపక్షం వివిధ అంశాల గురించి నోటీసులు ఇస్తుంది.  వాటిపై అధికార పక్షం చర్చించాలి.  


జగన్ కు అనుభవం లేదు.  ఈజీగా ఇరుకున పడెయ్యచ్చు అన్నది బాబుగారి ఆలోచన.  ఈ ఆలోచనను ముందుగానే పసిగట్టిన జగన్.. బాబుకు అలాంటి అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాడు.  మొత్తం 23 సబ్జక్ట్స్ మీద చర్చించేందుకు రెడీ అయ్యారు.  ఆ 23 అంశాలే కాకుండా ప్రతిపక్షం దగ్గర ఇంకేమైనా చర్చించేందుకు సబ్జక్ట్స్ ఉంటె వాటిపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని బాబుకు సవాల్ విసిరారు.  


అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షం అనుకుంటే.. అధికారంలో ఉన్న పార్టీనే చర్చించే అంశాల గురించి అడగడంతో పాటు ఎలాంటి అంశంపైనైనా ఎంత సమయమైనా కేటాయించి చర్చించేందుకు సిద్ధం అనడంతో ప్రతిపక్షం ఖంగు తిన్నది.  ఇక జగన్ సిద్ధం చేసుకున్న ఆ సబ్జక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.  


వ్యవసాయ రంగం- రైతు భరోసా-40 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు,   రాష్ట్రంలో విద్యారంగం - పాఠశాలలు,  కాలేజీల పరిస్థితి, అమ్మఒడి,  అధిక ఫీజుల నియంత్రణ,  పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు, పారదర్శకమైన పాలన,  అవినీతి నిర్మూలన,   ప్రభుత్వ నామినేటెడ్ పదవులు,   పనుల్లోనూ బడుగు బలహీన వర్గాలు,   మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు,  నీటిపారుదల రంగం- పోలవరం,   ఇతర ప్రాజెక్టులు,  గృహ నిర్మాణం-  25 లక్షల ఇళ్లస్థలాలు,  రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు,  గత ఐదేళ్ల అప్పులు - బకాయిలు,  ప్రత్యేక హోదా,  విభజన హామీలు,  కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రాని నిధులు,  విద్యుత్ రంగం-వాస్తవాలు,  రాజధాని అంశం - సీఆర్ డీఏ పరిధిలో భూ కేటాయింపులు,   పొదుపు సంఘాల రుణాలు - వాస్తవాలు,  బెల్టు షాపులు - ఎక్సైజ్ పాలసీ,   గ్రీవెన్సె - స్పందన కార్యక్రమం,  ఇసుక అక్రమ రవాణా,  గత ఐదేళ్లలో రాష్ట్రంలో భూ కేటాయింపులు,  అగ్రిగోల్డ్ అంశం,  జన్మభూమి కమిటీలు - రాజ్యాంగేతర శక్తులు,  అవినీతి,  కే టాక్స్, నదుల ఆక్రమణలు,  అక్రమ కట్టడాలు - భవిష్యత్ పై ప్రభావం,  కాంట్రాక్టులు - అవకతవకలు - అవినీతి,  ఉద్యోగాలు - నిరుద్యోగం,  గ్రామ సచివాలయం,  గ్రామ వాలంటీర్లు,  ప్రభుత్వ ఉద్యోగులు - సంక్షేమం. 



ఇవే కాకుండా ఇంకా ఇతర అంశాలు ఏమున్నా సరే చర్చించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని సభలో చెప్పడం విశేషం.  మరి దీనిపై బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: