ఆ జిల్లాలో 486 ఆవాసాలకు రోడ్లు లేవు..?

వానలు పడితే,వాగులు, వంకలు పొంగి, ఎన్నో పల్లెల ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోవాల్సిందే. దాదాపు సగం పల్లెలకు దారి ఉండదు. కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో 1045 ఆవాసాలు ఉండగా 486 ఆవాసాలకు కనీసం రోడ్డు కూడా లేదు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, కిలోమీటర్ల కొద్ది మోసుకుపోవాలిసన దయనీయ పరిస్థితి.

ఇప్పటికీ జిల్లాలో 486 గ్రామాలకు రోడ్లు ,కల్వర్టులు ,వంతెనల నిర్మాణంకు రూ.761.07 కోట్లు అవసరమని పంచాయతీరాజ్‌ శాఖ అంచనా...
'' రహదారులు లేక, జనం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వాస్తవమే. రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధుల కొరత కారణంగా పనులు చేయలేక పోతున్నాం.

'' పంచాయతీ రాజ్‌ అధికారులంటున్నారు. ఇటీవల కొన్ని రోడ్లు మంజూరయినప్పటికీ, అయితే అటవీ అనుమతులు రాక వాటి పనులు ఆలస్యం అవుతున్నాయి. ఆదివాసీ గూడేలకు వెళ్లేందుకు కనీసం రోడ్డు లేకపోవడంతో, వానకాలం ప్రజల కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా శ్రద్ధ పెట్టాలని ఈ ప్రాంతపు ప్రజలు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: