ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు శాసన మండలిలోనూ తొలిరోజే అధికార, ప్రతిపక్షాల మధ్య రచ్చరచ్చ సాగింది. ఈరోజు శాసనమండలి ప్రారంభం కాగానే రైతుల మరణాలపై తెలుగుదేశం వాయిదా తీర్మానం ఇచ్చింది. అందుకు ఛైర్మన్ షరీఫ్ తిరస్కరించారు.


వ్యవసాయ మంత్రి కన్నబాబు సోదరుడు సురేశ్ మరణించిన కారణంగా ఆయన అందుబాటులో లేరని తెలిపింది. అంశంపై మరోసారి దీనిపై చర్చిస్తామని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రతిపక్షానికి సమాధానం ఇచ్చారు.


దీంతో తెలుగుదేశం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లేకపోయినంత మాత్రాన చర్చ జరగకూడదనడమేంటని మండిపడ్డారు. రైతు చనిపోతే కూడా సభలో చర్చించరా? అంటూ వెల్ లోకి వెళ్లి నినాదాలు చేశారు.


రైతు మరణం అంశాన్ని తెలుగుదేశం రాజకీయంగా వాడుకుంటుందని భావించిన వైసీపీ అదే స్థాయిలో స్పందించింది. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి టీడీపీ విమర్శలను తిప్పికొట్టారు. గత ఐదేళ్లలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో తెలియదా అంటూ కౌంటర్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: