ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల తొలి రోజు అధికార‌, విప‌క్ష నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర సంవాదం సాగింది. స‌భా నాయ‌కుడి హోదాలో ఉన్న సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడైన చంద్ర‌బాబుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. ముఖ్యంగా స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే గురువారం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో మొదలైంది. ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు అధికార ప‌క్షం జ‌వాబిచ్చే ప్ర‌య‌త్నం చేసింది. అయితే, ఈ క్ర‌మంలో ప్ర‌తిప‌క్షం కొన్ని లోతైన ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. ఎర్ర‌చందనం, ప్రాజెక్టులు, ప్ర‌ధాన ర‌హ‌దారులు, స్మ‌గ్లింగ్‌, నీటి వివాదాలు, తెలంగాణతో జ‌గ‌న్ సత్సంబంధాలు వంటి విష‌యాల‌పై ప్ర‌తిప‌క్షం నుంచి ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి. 


అయితే, కొన్నింటికి స‌రైన స‌మాధాన‌మే వ‌చ్చినా.. మ‌రికొన్నింటికి మాత్రం అధికార ప‌క్షం స‌భ్యులు, మంత్రులు స‌మాధా నం చెబుతూనే టీడీపీపై విరుచుకుప‌డ్డారు. జాతీయ ర‌హ‌దారుల ప్ర‌స్థావ‌న వ‌చ్చిన‌ప్పుడు మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.. మా ట్లాడుతూ.. గ‌త ఐదేళ్ల కాలంలో ఉన్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేత‌కాని త‌నం కారణంగానే ర‌హ‌దారులు నిర్మించేందుకు ప్ర‌పంచ బ్యాంకు నిధులు ఇచ్చి, ఎదురు చూసి.. తిరిగి త‌న సొమ్మును త‌ను వెన‌క్కి తీసుకుంద‌ని తీవ్ర స్థాయిలో విమ ర్శించారు. ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టును ఎప్ప‌టిలోగా పూర్తి చేస్తారంటూ.. టీడీపీ స‌భ్యుడు నిమ్మ‌ల రామానాయుడు అడిగిన ప్ర‌శ్న‌కు మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ త‌న‌దైన శైలిలో స్పందించారు. 


ఈ క్ర‌మంలోనే మంత్రి నోటివెంట‌.. రూ.450 కోట్లు దొబ్బేశారంటూ.. అన్ పార్ల‌మెంట‌రీ వ్యాఖ్య చోటు చేసుకుంది. ఈ విష యంలో స్పీక‌ర్ జోక్యం చేసుకోకుండానే మంత్రి అనిల్ త‌న త‌ప్పును తెలుసుకుని, ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకున్నారు. ఇక‌, ఏపీ ఆస్తుల‌ను తెలంగాణ‌కు దోచి పెడుతున్నారంటూ.. టీడీపీ నేత‌లు స‌హా చంద్ర‌బాబు చేసిన కామెంట్ల‌పై జ‌గ‌న్ స్పందించారు. ఈయన కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు స్విచ్చు నొక్కేందుకు సీఎం హోదాలో నేను వెళ్లాన‌ని, త‌న హ‌యాంలో కేవ‌లం ప్రారంభం మాత్ర‌మే చేశార‌ని, కానీ, చంద్ర‌బాబు హ‌యాంలో ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్మించార‌ని,  కాబ‌ట్టి.. చంద్ర‌బాబు గ‌డిచిన ఐదేళ్ల‌లో రాష్ట్రంలో అధికారంలో ఉండి గాడిద‌లు కాశారా?! అని ప్ర‌శ్నించారు. 


దీంతో ఒక్క‌సారిగా స‌భ‌లో ర‌గ‌డ ప్రారంభ‌మైంది. టీడీపీ స‌భ్యుడు నిమ్మ‌ల రామానాయుడు ఆఫ్ ది మైక్‌లో మాట్లాడుతూ.. మా నాయ‌కుడిని సీఎం గాడిద అన్నారు! అంటూ నినాదాలు చేశారు. దీంతో మ‌రోసారి మైకందుకున్న సీఎం జ‌గ‌న్‌.. సామెత‌కు-కామెంటుకు కూడా తేలియ‌ని వారు రాష్ట్రాన్ని పాలిస్తే.. ఇలానే ఉంటుంది అధ్య‌క్షా..రాష్ట్రం స‌ర్వ నాశ‌నం అయిపోయింది.అంటూ ముక్తాయించారు. మొత్తంగా చూసుకుని స‌భా స‌మ‌రం.. వాడివేడిగానే క‌నిపించింది. రాబోయే రోజుల్లో ఇంకెంత వేడిగా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: