ప్రపంచకప్ సాధించుకుని వస్తుందనుకున్న టీమిండియా సెమీస్ లోనే ఇంటిముఖం పట్టడంతో క్రీడాభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ఈ విషయం ట్రెండింగ్ గా మారుతోంది. అయితే ఇండియా ఓడినందుకు బాధపడాల్సిన అవసరం లేదంటూ ఓ సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటో మీరూ చూడండి..


“ 90శాతం పైగా జనాభాకు పట్టుమని 10శాతం ప్రాతినిధ్యం లేని ఆటలో,

పాతిక రాష్ట్రాలకు పైగా అసలు ప్రాతినిధ్యం లేని ఆటలో,

నైపుణ్యాలను నెలవైన దేశ సగం ప్రాంతానికి అసలైన ప్రాతినిధ్యం లేని ఆటలో,

ఆడడం కన్నా చూడడం ముఖ్యమైపోయిన ఆటలో,

కుల,ప్రాంత స్వార్థపు గూడుపుఠానీల వ్యాపారంలో

నువ్వేం కోల్పోయావని బాధపడాలోయ్?


అయినా, ఒక ఫక్తు వ్యాపార సంస్థ గెలిస్తే-

ఆది దేశం గెలిచినట్టుగాదు, అందులో దేశభక్తి అంతకన్నా లేదు. జనం జీవితాలు బాగుపడ్డాయనడానికి కొలమానం అస్సలు కాదు.

నీ అరుగాలపు శ్రమ మీద వానకురిసినట్టుకాదు,

నీ ప్రతిభకు సరిపడా ఉపాధి దొరికినట్టు కాదు,

మురికి రాజకీయాలన్నీ ఉతికారేసినట్టు కాదు,

తినే తిండి, కట్టే బట్ట మీద నిషేధం తొలగినట్టుకాదు,


వెలివేతలు, కులహత్యలు, మతదురాభిమానాలు, పసిపిల్లను కూడా వదలకుండా అడపిల్లలమీది మానభంగాలు.. సమసిపోవు.

ఏం ఫర్వాలేదు, రేపటి నుండి యధావిధిగా మోసం చేసే ప్రభుతలుంటాయి, వాటిని మాసిపూసి చూపే మీడియాలుంటాయి. మన బ్రతుకులిలాగే ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: