గత పదేళ్లుగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇప్పుడు వరుసగా చిక్కులొచ్చి పడుతున్నాయి. అధికారంలో ఉన్నాముకదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎప్పటికైనా సమాజానికి సమాదానం చెప్పకతప్పదని ప్రస్తుత పరిణామాలు రుజువుచేస్తున్నాయి. ఇప్పటికైనా తెలుగు దేశం నేతలు తమ నడవడి ప్రవర్తన మార్చుకుంటారో లేదో గాని వారికి జరగాల్సిన నష్టం ఒక పక్కనుంచి యమగండంలా జరిగిపోతోంది. 


అక్రమ కట్టడమంటూ ప్రజావేదికను కూల్చివేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కార్యాలయం పరిస్థితి కూడా అదే విధంగా తయారైంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర కార్యాలయం లేకపోవడం పెద్ద సమస్యగా మారిన విషయం విధితమే. దానికి తోడు నూతనంగా కార్యాలయ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో అప్పటి వరకు గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయాన్నే రాష్ట్ర కార్యాలయంగా మార్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలన్నింటిని గుంటూరు పార్టీ కార్యాలయం వేదికగా నిర్వహిస్తోంది.


అయితే అదికూడా అక్రమ కట్టడమంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుంటూరుఉ మునిసిపల్‌ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయం కార్పొరేషన్ సంస్థలో నిర్మించారని అది అక్రమ కట్టడమంటూ ఆరోపించారు. దాన్ని కూల్చివేయాలని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: