చంద్రబాబు హుందా రాజకీయాల గురించిమాట్లాడుతారు. అయితే తన వరకూ వస్తే మాత్రం ఆయన పాటించరన్నది అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా   బడ్జెట్ సమావేశాలో తొలి రోజే చంద్రబాబు సహనాన్ని కోల్పోయారు. ఆయన జగన్ని ఉద్దేశించి హెచ్చరిక ధోరణిలో మాట్లాడుతూ వూగిపోయారు. ఓ దశలో స్పీకర్ తమ్మినేని సీతారామ్  ని సైతం తప్పుపట్టారు.


అసెంబ్లీలో చంద్రబాబు బీపీని పెంచే విషయం ఏంటంటే ఆయన రైతులకు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేదు. అయిదేళ్ళ పాటు రైతుల నెత్తిన భారం మోపారు. దాన్ని జగన్ రికార్డులు తీసుకువచ్చి మరీ నిరూపించారు. ఇక్కడ జగన్ ఒక షరతు పెట్టారు. రికార్డులలో మీరు సున్నా వడ్డీకి చెల్లించలేదని తేలితే ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతారా అని. సవాల్ చేశారు. 


దాంతో బాబు గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. తనను ఉన్న ఆ పదవి నుంచి కూడా రాజీనామా చేయమంటారా అన్న ఆక్రోశం నుంచి ఆయన ఓ రేంజిలో చెలరేగిపోయారు. జగన్ నీ చరిత్ర తెలుసు అంటూ వూగిపోయారు. హుందాగా ఉండడం నేర్చుకో, ప్రతిపక్షాన్ని అవమానం చేస్తావా, మేము గాడిదలు కాస్తామా. నీ దగ్గర తిట్టించుకోవడానికి సభకు వచ్చామా అంటూ ఆవేశంతో హాట్ కామెట్స్ చేశారు. 


స్పీకర్ కూదా వైసీపీ నేతల మాటలను పట్టించుఇకోవడంలేదంటూ ఆయన మీద కూడా బాబు ఎగిరారు. మొత్తానికి బాబు బీపీని పెంచేసిన జగన్ మాత్రం బాబు తిడుతూ ఉంటే నవ్వుతూ తన సీట్లో కూర్చున్నారు.జగన్ని సీఎం గా చూడడం ఎందుకో బాబుకు నచ్చడంలేదని తెలుస్తోంది. అదే విధంగా బాబు  విపక్ష నేత సీట్లో కూర్చోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: