ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు ఈరోజు నుంచి 14 రోజుల పాటు ఈ నెల 30వ తేదీ వరుకు ఈ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. అయితే సమావేశాలు మొదలవ్వడం ఆలస్యం. ఒకరిపై ఒకరు ప్రశ్నలతో సినిమాలలో కూడా కనిపించనటువంటి డైలాగులు వేసుకున్నారు రాజకీయ నేతలు. కొన్ని కొన్నిసార్లు ఆన్ పార్లమెంటరీ డైలాగులు కూడా వాడారు. మరికొంతమంది నవ్వుతూనే కడుపు భగ్గుమనేలా డైలాగులు విసురుకున్నారు. అందులో కొన్ని డైలాగులు మీకోసం... 


కోడలి నాని, అచ్చెన్నాయుడు కామెడీ డైలాగులు ... 
అచ్చెన్నాయుడు వైసీపీ కోడలి నాని పలకరిస్తూ నల్లబడ్డావ్ ఏంటి నాని ? అని అన్నాడు. దీంతో టక్కున అందుకున్న కోడలి నాని 'నేను మీలా రెస్ట్ తీసుకోలేదు కదా' అంటూ సమాధానం ఇచ్చారు. రేషన్ లో ఇస్తామన్న సన్నబియ్యం సంగతి తెలుస్తానని అచ్చెన్నాయుడు అనగా ... నువ్వు ఏమి తేల్చలేవు.. సన్నబియ్యం ప్రజలకు ఇచ్చి తీరుతా .. అవసరమైతే నీకు కూడా ఒక సంవత్సరానికి అయ్యే అన్ని పంపిస్తా అంటూ కౌంటర్ ఇచ్చాడు నాని. 


మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆన్ పార్లమెంటరీ డైలాగ్ .. 
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దొబ్బేశారని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యకు టీడీపీ నేతలు నిరసనలు తెలిపారు, స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ ఆన్ పార్లమెంటరీ పదాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రికి సూచించారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యను వెనక్కు తీసుకోక తప్పలేదు. 


చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా .. చంద్రబాబుపై జగన్ ఫైర్ 
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించిన సీఎం జగన్ ఇప్పుడు ఏపీ సీఎం హోదాలో ప్రారంభోత్సవానికి వెళ్లడంపై టీడీపీ నేతలు ప్రశ్నలు కురిపించారు. దీంతో సీఎం జగన్ స్పందిస్తూ 'కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఇప్పుడు నేను వెళ్లిన వెళ్లకపోయినా, ఆ ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది' అని, నేను ఇదే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని. ఐదేళ్లు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వాళ్లు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే..  ఈయన ఇక్కడ 'గాడిదలు' కాశాడు అని అడుగుతున్నా?’ అని, ఏదైనా రాష్ట్రానికి మంచి చేస్తే అభినందించాలి. కానీ ఆ గుణం టీడీపీకి లేదని.. ఇలాంటి దిక్కుమాలిన ప్రతిపక్ష పార్టీని ఎక్కడ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్. 


జగన్ పై చంద్రబాబు ఫైర్ ... 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 'కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే స్పందిస్తారు అని నేను అనుకోలేదు. మీకు ఇది మంచి అవకాశం ఉపయోగించుకోండి. రాష్ట్ర సమస్యలు పరిష్కరించండి. రాజకీయ అనుభవం అంత వయసులేదు మీకు.. ఏది గుర్తుపెట్టుకోండి అని వ్యాఖ్యానించారు' ఈ వ్యాఖ్యలతో సీఎం జగన్ సహా పలువురు సభ్యులు నవ్వు ఆపుకోలేకపోయారు. ఇంతలో అధికార పక్ష సభ్యులు గోలగోల చెయ్యడంతో.. సహనం కోల్పోయిన చంద్రబాబు 'తమాషా చేస్తున్నారా మీరు .. నా నోరు ఇక్కడ మూయించగలరు కానీ బయట మూయించలేరు అని వర్ణింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఈరోజు అసెంబ్లీలో హైలెట్స్ ఇవి.. ఇంకా ఉన్నయి... 


మరింత సమాచారం తెలుసుకోండి: