కర్ణాటక రాజకీయం మరింత ముదురుపాకాన పడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల రాజీనామాలతో వేడెక్కిన రాజకీయం తాజా సుప్రీంకోర్టు తీర్పుతో మరింత రంజుగామారింది. కర్నాటక కాంగ్రెస్, జెడిఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించకపోవడంపై ఇప్పటికే బీజేపీ సుప్రింకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


ఈరోజే కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు తన తాజా తీర్పులో చెప్పింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్పీకర్ వద్దకు వెళ్లి వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ వివరణపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు డిజిపి రక్షణ కల్పించాలని కూడా కోర్టు ఆదేశించింది.


రాజీనామాలపై స్పీకర్ తన నిర్ణయాన్ని శుక్రవారం కోర్టుకు తెలియజేయాలని కూడా కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పునకు ముందు వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల రాజీనామాలపై వివాదం చేయడం ఆశ్చర్యంగా ఉందని వారి తరపు న్యాయవాది రోహత్ ముద్గల్ వ్యాఖ్యానించారు.


అయితే ఇందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాత్రం భిన్నంగా స్పందించారు. ఇలా వివాదం చేయడం తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని కామెంట్ చేశారు. స్పీకర్ తన నిర్ణయం కోర్టుకు చెప్పేందుకు అవకాశం ఇచ్చినందువల్ల కేసును శుక్రవారం విచారణ కొనసాగిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: