అసెంబ్లీలో అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నించిన విపక్షం అడ్డంగా ఇరుక్కుపోయింది. రాష్ట్రంలో నీటి కొరత, రైతు కష్టాలు అంశంపై చర్చ సందర్భంగా రాష్ట్రమంతటా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యేలు విమర్శించారు. రాష్ట్రంలోని ఏ ఏ జిల్లాల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో సోదాహరణంగా సుదీర్ఘంగా వివరించారు.


అయితే.. ఈ పరిస్థితి ఒక్కరోజులు వచ్చింది కాదన్న అంశాన్ని అధికారపక్షం సమర్థంగా వినిపించింది. ఉదాహరణకు విశాఖలో నీటిసమస్య గురించి విశాఖ జిల్లా ఎమ్మెల్యే ఒకరు మాట్లాడటగా.. వైసీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. గత ఐదు సంవత్సరాలు విశాఖకు నీటి సమస్యే లేనట్లు..ఈ రోజే కొత్తగా నీటి సమస్య వచ్చినట్లు ప్రతిపక్షం మాట్లాడుతుందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ దుయ్యబట్టారు.


విశాఖలో నీటి సమస్య రావడానికి కారణం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేయడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని తెలిపారు. గత ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేసి వందల కోట్లు సంపాదించారన్నారు. విశాఖ జిల్లాలో నదులు ఇసుక దోపిడీకి గురువుతున్నాయని ఆనాడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబుకు చాలాసార్లు చెప్పానని అవంతి శ్రీనివాస్ తెలిపారు.


అప్పటి టీడీపీ ఎమ్మెల్యే అవినీతి ఫలితం నేడు అనుభవిస్తున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నీటి సమస్యపై సమీక్షలు నిర్వహించామని..విశాఖ ప్రజలకు దాహార్తిని తీర్చడానికి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి సభకు వివరించారు. మొత్తానికి వైసీపీని ఇరుకున పెట్టాలని ప్రయత్నించి.. టీడీపీ ఇరుక్కుపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: