చేసిన పాపం ఊరికే పోదని సామెత.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అదే సమస్య ఎదురవుతోంది. అసెంబ్లీలో ఏం చేసినా.. అప్పుడు మీరు చేసిందేమిటి అన్న ప్రశ్న వైసీపీ సభ్యుల నుంచి షరా మామూలుగా వస్తోంది. గతంలో టీడీపీ అసెంబ్లీలో చేసిన దారుణాలు ఇప్పుడు అదే పార్టీకి గుదిబండగా మారుతున్నాయి.


గురవారం అసెంబ్లీ సమావేశాల తొలిరోజు అదే సమస్య టీడీపీకి ఎదురైంది. ప్రతి ఎమ్మెల్యేకూ కరవు నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఎమ్మెల్యేకు కోటి రూపాయలు ఇస్తామని జగన్ ప్రతిపాదించారు. దీనికి చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పాలని మరో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.


ఈ సమయంలో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఎస్సీ ఎమ్మెల్యేను రైతు దినోత్సవం రోజు వైసీపీ అవమానించిందని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఆ సమయంలో మంత్రి బుగ్గన కలుగుజేసుకున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు రూ.కోటి ఇస్తామని మాత్రమే సీఎం జగన్ హుందాగా చెప్పారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఎక్కడో ఎమ్మెల్యేను అడ్డుకుంటే చట్టాలు ఉన్నాయనీ, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


‘ఒకటి అడుగుతా అధ్యక్షా.. ఇదే నిండు సభలో మా నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండగా ఆయన్ను పాతిపెడతామన్నారు కదా అధ్యక్షా.. మరి ఆ రోజు చర్యలు లేవే అధ్యక్షా? మనం అడుగుతా ఉండేది ఏమీ? మంచి హుందాగా ప్రతిపక్షానికి కూడా అవకాశం ఇస్తాం. మీరు ధన్యవాదాలు, అభినందలు తెలిపితే బాగుంటుంది అని చెప్పాం అధ్యక్షా’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: