
ప్రేమ రెండక్షరాల ఓ చిన్న మాట,కానీ రెండు మనసులను ఒక్కటి చేసి ఒక్కటిగా బ్రతగడానికి ధైర్యాన్ని ఇస్తుంది. పెద్దలకు ఉన్న కులం, మతం వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. కేవలం కులం కారణంగా విడిపోయిన
ప్రేమలు చరిత్రలో చాలా ఉన్నాయి. కులం వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రేమికులు కూడా మనకి తెలుసు.
ఒక దళితుడు తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు అన్న ఒకే ఒక కారణం చేత అల్లుడ్ని నడిరోడ్డు మీద నరికి చంపించాడు మిర్యాలగూడలో మారుతి రావు,గొప్పింటి ప్రేమ దళితుల జీవితానికి శాపంగా మారింది అనే చెప్పాలి.యూపీ బీజేపీ ఎమ్మెల్యే
రాజేష్ మిశ్రా కూతురు కూడా ఓ దళితుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
తన పెళ్లి జరగడం తండ్రికి ఇష్టం లేదని,తన తండ్రి వల్ల తమకి ప్రాణ హాని ఉందని, తమకి పోలీసులు రక్షణ కల్పించాలని తను పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాను వాళ్ళను బెదిరించలేదని,తనకంటే
వయసులో పెద్దవాడిని ఎలా పెళ్లిచేసుకుంటుంది అని,అది తనకు నచ్చలేదని చెప్పారు. మరోవైపు ఆమెకు,ఆమె భర్త కు రక్షణ కల్పించాలని బరేలి ఎస్పీని డిఐజి ఆర్ కె పాండే ఆదేశించారు.
కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్