అసెంబ్లీలో అధికార  వైకాపాకు, ప్రతీక్ష  తెలుగుదేశం పార్టీ మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది .  అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు ఇరు పార్టీల మధ్య తీవ్ర స్థాయి వాగ్వివాదాలు,  ఆరోపణలు ప్రత్యారోపణలు,  విమర్శలు ప్రతి విమర్శలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరు కావడం పట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు తీవ్ర అభ్యంతరాన్ని  వ్యక్తం చేశారు.


 టిడిపి ఎమ్మెల్యే అభ్యంతరం  పై సభా నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే 5 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గాడిదల కాచారా  అంటూ  ప్రశ్నించడంతో సభలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.  ముఖ్యమంత్రి వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచిందని దాని వల్లే ఈ రోజు శ్రీశైలం కు వరద నీరు రావడం బాగా  తగ్గి పోయిందని జగన్ అన్నారు.  ఆల్మట్టి నుండి శ్రీశైలం ప్రాజెక్టుకు 1100 టిఎంసిల నీరు రావాల్సి ఉండగా ప్రస్తుతం 600 కు మించి  రావడంలేదని  పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి జలాలను తమ సరిహద్దు ప్రాంతం నుంచి  శ్రీశైలం,  నాగార్జున సాగర్ కు తరలించడానికి పెద్ద మనసుతో ముందుకు వచ్చారని ప్రశంసించారు.


 ప్రతిదీ రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీ అలవాటేనన్న ఆయన ,  హరికృష్ణ శవం పక్కనే రాజకీయాలు మాట్లాడింది తెలుగుదేశం పార్టీ అదినేత చంద్రబాబు నాయుడు కాదా అంటూ ప్రశ్నించారు. జగన్ విమర్శలపై చంద్రబాబు ధీటుగానే స్పందించారు . కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మధ్య భారత్ , పాక్ మధ్య మాదిరి నిత్యం ఘర్షణలే జరుగుతాయన్న ఆయన , ఇప్పుడు మాట మార్చితే తాము ఏమి చేయలేమంటూనే , జలవివాదం పై తనదైన శైలిలో చురకలంటించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: