దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ మిత్రుడు అనగానే గుర్తుకు వచ్చే ఒకే ఒక పేరు కేవీపీ  రామచంద్ర రావు.  కేవీపీతో పాటు వైఎస్ కు మరొక సన్నిహిత మిత్రుడు ఉన్నారు ...   ఆయన పేరే  దుట్టా రామచంద్రరావు.  కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ చెందిన దుట్టా రామచంద్ర రావుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డితో  1976 నుంచి సన్నిహిత స్నేహం సంబంధం ఉంది .


వైయస్ మరణాంతరం కూడా ఆ కుటుంబం తో దుట్టా స్నేహసంబంధాలు కొనసాగుతున్నాయి . దుట్టా , వైయస్ స్నేహానికి గుర్తుగా వైయస్ సతీమణి విజయమ్మ ఇటీవల తన భర్త   70 వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు  ఒక అరుదైన కానుక అందజేశారు.  వైయస్ బతికి ఉన్నప్పుడు ధరించిన దుస్తులను ఆమె,   దుట్టా రామచంద్రరావు  కానుకగా అందజేయడం తో , ఆయన ఉబ్బితబ్బిబ్బవుతున్నారు .  తన స్నేహితుడు ధరించిన దుస్తులను అపురూపంగా   చూసుకున్న దుట్టా రామచంద్రరావు వాటిని అయన జ్ఞాపకంగా పదిలపర్చుకోనున్నట్లు చెప్పారు .


 వైయస్  మరణాంతరం కూడా ఆయన  కుటుంబం తనపై  చూపించే  ప్రేమ ఆప్యాయత కు దుట్టా పొంగిపోతున్నారు .  వైఎస్ బతికి ఉన్నప్పుడే కాదని ఆయన మరణానంతరం కూడా వైఎస్ కుటుంబం తనపై ఎంతో ప్రేమ , వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు .  ప్రస్తుతం దుట్టా రామచంద్రరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కృష్ణా జిల్లా  కీలక నేతగా కొనసాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: