తెలుగుదేశం పార్టీ తరఫున ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన  ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ,  వైకాపా తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా న్యాయస్థానాన్నీ  ఆశ్రయిస్తున్నారు.  ఎన్నికల అఫిడవిట్ లో ఒకరు  తన సంతాన వివరాలు  పొందుపరచలేదని,  మరొకడు తన ఆదాయ మార్గాలు చూపలేదని పేర్కొంటూ వైకాపా తరుపున పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పటి వరకు  న్యాయస్థానం లో  పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెల్సిందే .


  అయితే ఇప్పటివరకు టిడిపి ఎమ్మెల్యేలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్న వైకాపా  నేతలు,  తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది .  చంద్రబాబు తన ఎన్నికల అఫిడవిట్ లో సరైన సమాచారం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని చేశారని చిత్తూరు జిల్లా , వైకాపా నాయకుడు సాగర్  హైకోర్టు లో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని  దాఖలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.  తన వ్యాజ్యంలో సీఎంగా తనకు వచ్చిన  జీతం ,  జమా ఖర్చులు లెక్కలను చంద్రబాబు  చూపెట్టలేదని  విద్యాసాగర్ పేర్కొన్నాడు.


 టీడీపీ ఎమ్మెల్యేలపై వైకాపా నేతలు న్యాయపోరాటం చేయాలనీ నిర్ణయించుకోవడం వ్యక్తిగతంగా వారి ఇష్టమే అయినప్పటికీ , చిన్న , చిన్న విషయాలను పెద్దవిగా చేసి చూపించే ప్రయత్నాన్ని ప్రజలు పెద్దగా పరిగణలోకి తీసుకోరన్న విషయాన్ని గ్రహిస్తే మంచిది . న్యాయస్థానాల్లో ఒకరి వెంట మరొకరు పిటిషన్లు దాఖలు చేయడం వల్లే తామే పల్చనయ్యె ప్రమాద ముందని, దానివల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: