మాజీ మంత్రి , ఎమ్మెల్యే , టిడిపి శాసనసభ ఉప నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు గన్ మేన్లు లేకుండానే ఒంటరిగా పర్యటనలు చేస్తుండడంతో టిడిపి శ్రేణులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత గడిచిన 35 రోజులుగా ప్రభుత్వ పరంగా నియమించిన గన్ మేన్లు భత్రత లేకుండానే పలు ప్రాంతాలును పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలో సైతం మారుమూల ప్రాంతాలు , కొండ ప్రాంతాల్లో సైతం  ఒంటరిగానే పర్యటిస్తున్నారు.


ఇటీవలే నందిగం మండలం కొండ ప్రాంతమైన రాంపురం పంచాయితీకి భద్రాత లేకుండానే ఎమ్మెల్యే పర్యటించడంతో అటు టిడిపి కార్యకర్తలు , నాయకులకు సైతం ముచ్చెమటలు పట్టించి గత ప్రభుత్వ హయంలో మంత్రిగా వ్యవహరించిన సమయంలో అచ్చెన్నాయుడుకు 4+4 గన్ మేన్లతో పాటు స్పెషల్ పోలీస్ , రోప్ పార్టీ , ఏపీ, ఏఆర్, పైలెట్ తదితర భద్రతా సదుపాయం ఉండేది. అయితే కొత్తగా వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ భద్రత సౌకర్యాన్ని తొలిగించి 2+2 గన్ మేన్ సౌకర్యాన్ని కల్పించారు. ఈ భత్రత ఇచ్చిన రెండురోజుల్లోనే తిరిగి ప్రభుత్వం గన్ మేన్లను తొలిగించింది. దీంతో అచ్చెన్నాయుడు ఆగ్రహంతో ఈ గన్ మేన్లు సౌకర్యం కూడా తనకు అక్కెరలేదని , ప్రభుత్వం ఇచ్చిన భద్రత లేకుండానే తనంతట తానే ప్రజలు మధ్యకు వెళ్తామని చెప్పి గన్ మేన్లను వెనక్కిపంపేసారు.


గతంలో అచ్చెన్నాయుడు సోదరుడు కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడుకు 1994లో సింగుపురం వద్ద మావోయిస్టులు మందుపాతర సంఘటన , అచ్చెన్నాయుడుకు సైతం మావోయిస్టులు బెదిరింపులు , రెక్కీలు నిర్వహించడం వంటి సంఘటనలు జరిగి నప్పటికీ ప్రభుత్వం భద్రత తగ్గించడంతో అటు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో పాటు టిడిపి, అధికారుల్లోనూ ఆందోళన నెలకొంది. అచ్చెన్నాయుడుకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని టిడిపి సభ్యులు హెచ్చరిస్తూ ప్రభుత్వ తీరుపై నిరశన వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: